Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు వ్యాక్సిన్ : హైదరాబాద్ సంస్థ ప్రయోగంలో పురోగతి

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (09:02 IST)
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటిక్ కరోనా వ్యాక్సిన్ తయారీలో అద్భుతమైన పురోగతి సాధించింది. కో వ్యాక్సిన్ పేరిట తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ తయారీలో భాగంగా, ఇప్పటికే పలు దశలను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో జూలై నెలలో మనుషులపై ప్రయోగాలు చేసేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతి కూడా మంజూరుచేసింది. 
 
జూలై పదో తేదీ నుంచి చేపట్టే మానవ క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వస్తే వాణిజ్యపరమైన ఉత్పత్తికి మార్గం సుగమం అవుతుంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరినాటికి భారత్ బయోటెక్ సంస్థ నుంచి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయని ఆ సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
 
మరోవైపు, కరోనా మహమ్మారి ఎంత వేగంగా విస్తరిస్తోందో, అంతేవేగంగా కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు సాగుతున్న విషయం తెల్సిందే. అయితే వ్యాక్సిన్ ఆవిష్కరణ అనేక దశలతో కూడిన ప్రక్రియకావడంతో మార్కెట్లోకి వచ్చేందుకు మరికాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో అద్భుతమైన పురోగతి కనపరుస్తూ ముందుకుసాగిపోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments