Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటును నియంత్రణలో ఉంచే బీట్‌రూట్ రసం!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (14:51 IST)
బీట్‌రూట్ రసం తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. హైపర్‌ టెన్షన్‌ అనే పత్రిక జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 
 
అధిక రక్తపోటు ఉన్నవారిలో కొందరికి మాత్రలకు బదులుగా 200 మి.లీ బీట్‌రూట్‌ రసాన్ని ఇచ్చి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచారు. ఆ రసం తీసుకున్న కేవలం మూడు నుంచి ఆరు గంటల్లోనే 10 ఎంఎంహెచ్‌జి రక్తపోటు తగ్గింది. 
 
పైగా ఆ రసం ప్రభావంతో అధిక రక్తపోటు 24 గంటల దాకా నియంత్రణలోనే ఉన్నట్టు వెల్లడైంది. అందువల్ల అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు నైట్రేట్‌ సమృద్ధిగా ఉన్న కూరగాయలు ఆకుకూరలు తరుచుగా తీసుకోవడం ద్వారా తమ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. 
 
అంతేకాకుండా, నైట్రేట్‌ సమృద్ధిగా ఉండే కూరగాయల్లోని నైట్రేట్‌లో అధిక రక్తపోటును తగ్గించేందుకు తోడ్పడే అంశాలున్నాయని స్పష్టమయ్యింది. మన శరీరంలో ఆహారంలోని నైట్రేట్‌ను నైట్రిట్‌ అనే రసాయనంగా ఆ తర్వాత నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మార్చే గుణం ఉంది. దీనికి రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్తపోటును తగ్గించే గుణం ఉందని వివరించారు. 

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

Show comments