Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ సురక్షితమైనదా? యాంటిబయోటిక్స్ వాడకంతో..?

Webdunia
బుధవారం, 30 జులై 2014 (17:09 IST)
చికెన్ అంటే లొట్టలేసుకుని తినేస్తున్నారా.. అయితే ఆలోచించండి. చికెన్‌ మటన్‌ కంటే టేస్టీతో పాటు రేటు కూడా తక్కువ కావడంతో మాంసాహార ప్రియులు కోడికే ఓటేస్తారు. కానీ, ఆ కోడిమాంసం సురక్షితమైనదేనా? అంటే, కాదంటున్నారు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) పరిశోధకులు. 
 
మనం తినే చికెన్‌లో యాంటిబయాటిక్స్ అవశేషాలు 40 శాతం మేర ఉంటాయని చెబుతున్నారు. సీఎస్ఈకి చెందిన పొల్యూషన్ మానిటరింగ్ లేబొరేటరీ (పీఎంఎల్) కోడిమాంసం శాంపిళ్ళపై పరిశోధనలు చేపట్టింది. మనుషులకు యాంటిబయాటిక్స్ వాడకం విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకున్నా... పౌల్ట్రీ పరిశ్రమలో మాత్రం విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని సీఎస్ఈ పేర్కొంది. త్వరగా ఎదిగేందుకు, స్వల్ప కాలంలోనే బరువు పెరిగేందుకు కోళ్ళకు యాంటీబయాటిక్స్ ఇవ్వడం పరిపాటిగా మారిందని పరిశోధకులు చెబుతున్నారు. 
 
ఇలా ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా కోళ్ళలో బ్యాక్టీరియా యాంటీబయాటిక్ నిరోధకతను సంతరించుకుంటాయట. ఆ మొండి బ్యాక్టీరియాలు కోళ్ళ నుంచి మనుషులకు సంక్రమిస్తాయని, తద్వారా ప్రమాదకర వ్యాధులు కోరి తెచ్చుకున్నట్టేనని సీఎస్ఈ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పౌల్ట్రీ పరిశ్రమలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించినప్పుడే చికెన్ సురక్షితమైనదిగా భావించాల్సి ఉంటుందని సీఎస్ఈ చెబుతోంది.

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం