Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందేశం: నగరంలో డెంగ్యూ కేసుల పెరుగుదల, లక్షణాలు-జాగ్రత్తలు

ఐవీఆర్
గురువారం, 18 జులై 2024 (21:18 IST)
ఈ వర్షాకాలంలో డెంగ్యూ కేసుల రేటు పెరిగింది. ఈ డెంగ్యూ జ్వరం అనేది ప్రధానంగా వ్యాధి సోకిన ఏడిస్ దోమల కాటు వల్ల వ్యాపిస్తుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కంటి నొప్పి, వికారం, వాంతులు, కీళ్ళు-కండరాల నొప్పి, చర్మంపై దద్దుర్లు, ఇంకా అప్పుడప్పుడు తేలికపాటి రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే, అవి ఆ వ్యక్తి డెంగ్యూతో బాధపడుతున్నట్లు తెలిపే సూచనలుగా భావించాలి.
 
ఎవరిలోనైనా ప్లేట్లెట్‌ల సంఖ్య చాలా తక్కువకు పడిపోతే అప్పుడు డెంగ్యూ ప్రాణాంతకంగా మారవచ్చు. కాబట్టి, మీరు గాని లేదా మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై చికిత్స తీసుకోవడం సరైనది. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి, సరైన చికిత్స తీసుకోవడం వల్ల తీవ్రమైన సమస్యల బారిన పడే ప్రమాదం తగ్గించవచ్చు.
 
అనుసరించాల్సిన కొన్ని భద్రతా సూచనలు ఇక్కడ ఉన్నాయి:
ఆరుబయట ప్రదేశంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా తెల్లవారుజామున ఇంకా సాయంత్రపు సమయాల్లో, DEET, పికార్డిడిన్ లేదా నిమ్మ యూకలిప్టస్ నూనె ఉన్న దోమ వికర్షకాలను(రిపలెంట్స్) వాడాలి.
 
పొడవైన చేతులు ఉన్న చొక్కాలు, ప్యాంటు ధరించడం వల్ల చర్మం బహిర్గతమవడం తక్కువగా ఉండేలా చేస్తే దోమ కాట్లను తగ్గించవచ్చు.
 
నిద్రపోయేటప్పుడు, ముఖ్యంగా చంటి పిల్లలు ఇంకా చిన్నపిల్లలకు, మీకు దోమల నుండి రక్షణగా పురుగుల మందుతో కోటింగ్ చేసి, తయారు చేసిన దోమతెరలను వాడటం మంచిది.
 
దోమలు పెరిగేందుకు అనుకూలమైన నీరు నిల్వ ఉంచే పాత్రలు సరిగ్గా కప్పబడి ఉండేలా చూసుకోవాలి, తద్వారా దోమలు పెరిగే ప్రదేశాలు లేకుండా చేయొచ్చు.
- డాక్టర్ ఎం. దేవి వినయ, ఎంబిబిఎస్ ఎమ్.డి ఇంటర్నెనల్ మెడిసిన్, అపోలా స్పెక్ట్రా హాస్పిటల్స్, హైదరాబాద్
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

తర్వాతి కథనం
Show comments