Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో చిల్డ్రన్స్‌ హైజీన్‌ పార్లమెంట్‌ను రెకిట్స్‌ డెటాల్‌తో కలిసి ప్రారంభించిన అపోలో ఫౌండేషన్‌ టోటల్‌ హెల్త్‌

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (18:05 IST)
అపోలో హాస్పిటల్స్‌ యొక్క సీఎస్‌ఆర్‌ కార్యక్రమం అపోలో ఫౌండేషన్‌ టోటల్‌ హెల్త్‌, ఒక  రోజు పాటు చిల్డ్రన్స్‌ హైజీన్‌ పార్లమెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో నేడు నిర్వహించింది. అపోలో ఫౌండేషన్‌ టోటల్‌ హెల్త్‌, రెకిట్స్‌ డెటాల్‌ నడుమ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య రక్షక్‌ ప్రోగ్రామ్‌ కింద నిర్వహించారు. చిల్డ్రన్స్‌ హైజీన్‌ పార్లమెంట్‌ కార్యక్రమ నిర్వహణ ప్రధాన లక్ష్యం చిన్నారులు, ఉపాధ్యాయుల నడుమ ప్రవర్తన  పరంగా మార్పులను తీసుకురావడంతో పాటుగా పరిశుభ్రత మరియు శానిటేషన్‌ పరంగా ఉన్నత ప్రమాణాలను స్వీకరించడాన్ని ప్రోత్సహించడం. ఈ కార్యక్రమం పిల్లలను, వారి కమ్యూనిటీలలో ఆరోగ్యం మరియు పరిశుభ్రత యొక్క అంబాసిడర్‌లుగా మార్చే దిశగా నడిపించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఆరోగ్య రక్షక్‌ కార్యక్రమానికి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలున్నాయి. స్వల్పకాలిక లక్ష్యాలలో పరిశుభ్రత సంబంధిత కారణాల చేత కలిగే వ్యాధుల ప్రభావం తగ్గించడం; దీర్ఘకాలిక లక్ష్యాలలో ఆరోగ్యం- పరిశుభ్రత నడుమ సంబంధం అర్ధం చేసుకుని, వ్యక్తిగతంగా, ఇల్లు- కమ్యూనిటీ స్ధాయిలో వాటిని ఆచరించ కలిగిన సమాజం నిర్మించడం. ఈ సమాజం నీరు- పరిశుభ్రతకు ప్రాధాన్యతనందిస్తుంది.
 
మొత్తంమ్మీద 600 మంది విద్యార్ధులు, 60 మంది ఉపాధ్యాయులు 60 ప్రభుత్వ పాఠశాలల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నుంచి పాల్గొన్నారు. చిల్డ్రన్స్‌ హైజీన్‌ పార్లమెంట్‌లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా విద్యార్ధులు పాలుపంచుకోవడంతో పాటుగా గ్రూప్‌, సోలో సాంగ్స్‌, డ్యాన్స్‌లు కూడా చేశారు. ఈ కార్యక్రమం బహుమతులు, సర్టిఫికెట్ల ప్రధానంతో ముగిసింది. అపోలో ఫౌండేషన్‌ టోటల్‌ హెల్త్‌ను  డెటాల్‌ తో భాగస్వామ్యం చేసుకుని రెకిట్‌ యొక్క ఆరోగ్య రక్షక్‌ ప్రోగ్రామ్‌ కింద నిర్మించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో 100 ప్రభుత్వ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించగా, ఇప్పుడు దానిని 500 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించనున్నారు. ఇటీవలనే , టోటల్‌ హెల్త్‌ , రెకిట్‌తో భాగస్వామ్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లోని అరగొండ వద్ద మొదటి హైజీన్‌ పార్క్‌ ప్రారంభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

US Elections 2024: కొనసాగుతున్న పోలింగ్.. కమలా హారిస్, ట్రంప్ ఏమన్నారంటే...

హైదరాబాద్‌లో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024

సమాజ సేవ ద్వారా ఐక్యతను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్

పవన్ కల్యాణ్ చిన్నపిల్లాడి లెక్క మాట్లాడితే ఎలా?: మందక్రిష్ణ మాదిగ

కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్- రాహుల్ గాంధీ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

తర్వాతి కథనం
Show comments