Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతి గోళ్లు అలా వుంటే కాలేయం వ్యాధి వున్నట్లే... ఇంకా..

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (17:08 IST)
డాక్టర్ చెయ్యి పట్టుకోకుండానే, రక్త పరీక్షలు చేయకుండానే కేవలం ముఖ కవలికలను బట్టి, చేతి వేళ్ల చూసి వారికి భవిష్యత్తులో ఏ రకం వ్యాధులు శోకే అవకాశం ఉందో అని కొందరు అతి సులభంగా పసిగట్టేస్తుంటారు. కానీ వారు చెప్పే విషయాలను ఎవరూ నమ్మరు. అయితే అది నిజం. గోళ్ల ఆకృతి, రంగును బట్టి వారు భవిష్యత్తులో ఎటువంటి వ్యాధుల బారినపడే అవకాశం ఉందో అతి సులభంగా చెప్పవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
కొంత మందికి గోళ్లు పెరిగి వాటంతట అవే విరిగిపోతుంటాయి. ఇలాంటి వారికి కాల్షియం, విటమిన్ డి లేదా జింక్ లోపం ఉందని తెలుసుకోవచ్చట. అటువంటి వారు కొవ్వు తక్కువ శాతం ఉన్న పాలపదార్థాలు, చేపలు వంటి వాటిని తినడం ద్వారా కాల్షియం, విటమిన్ డి, జింక్ సమకూర్చుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
కొంతమందికైతే గోళ్లు పెరగనే పెరగవు. కొన్ని సార్లు పెరిగినా పాలిపోయినట్లు కనిపిస్తుంటాయి. ఇలాంటి గోళ్లు గల వారికి రక్తహీనత, పోషకాహార లోపం ఉందని గ్రహించాలి. దీని వల్ల గుండె లేదా కాలేయానికి సంబంధించిన వ్యాధుల బారినపడే ప్రమాదముందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొందరి గోళ్లు మందంగా పసుపు రంగులో, నెమ్మదిగా పెరుగుతుంటాయి. ఇలాంటి గోళ్లు గలవాళ్లు ఊపిరితిత్తుల వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీరు విధిగా ధైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలని కూడా సూచిస్తున్నారు. 
 
గోళ్లు నీలం రంగులో ఉంటే శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించడం లేదని భావించాలని, గోళ్లు అలా మారితే ఊపిరితిత్తులు, గుండె సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోళ్లు తెల్లగా ఉన్నా లేక గోళ్ల మధ్యలో తెల్లని చారలు కనిపిస్తున్నా సదరు వ్యక్తికి లివర్ సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదం ఉందట. లేదంటే హైపటైటిస్ వ్యాధి బారినపడే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మెడలో పుర్రెలు ధరించి వరంగల్ బెస్తంచెరువు స్మశానంలో లేడీ అఘోరి (video)

నారా రోహిత్‌కు లేఖ రాసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

జాతీయ రహదారుల తరహాలో గ్రామీణ రోడ్ల నిర్మాణం.. చంద్రబాబు

పెళ్లైన రోజే.. గోడకు తలను కొట్టి.. చీరతో గొంతుకోసి భార్యను చంపేశాడు

విశాఖలో లా విద్యార్థినిపై సామూహిక అఘాయిత్యం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేష్ మాస్ చిత్రం బచ్చల మల్లి డేట్ ఫిక్స్

పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?

రాజు వెడ్స్ రాంబాయి క్లైమాక్స్ చూశాక నిద్రపట్టలేదు : వేణు ఊడుగుల

అల్లు అర్జున్ గురించి నిజాలు బయటపెట్టిన మాత్రుమూర్తి నిర్మల

ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంది: జానీ మాస్టర్

తర్వాతి కథనం
Show comments