Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాఢనిద్రలోంచి మెలకువ వచ్చినా లేవలేరు.. కదల్లేరు.. గువ్వతొక్కిందా.. దయ్యం నొక్కుతోందా? ఏది నిజం?

మీరు గాఢ నిద్రలో ఉంటారు. ఉన్నట్లుండి పీడకల వచ్చింది. మీరు ఆమాంతం లోయలోకి పడిపోతున్నట్లు, కొండ కింది నుంచి జారి వేగంగా కిందికి పడిపోతున్నట్లు, లోతైన బావిలో జారి పడుతున్నట్లు కల కంటుండగానే ఉన్నట్లుండి మెలకువ వస్తుంది. మెలకువ వచ్చినా మీ శరీరం స్పృహలో ఉం

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (07:25 IST)
మీరు గాఢ నిద్రలో ఉంటారు. ఉన్నట్లుండి పీడకల వచ్చింది. మీరు ఆమాంతం లోయలోకి పడిపోతున్నట్లు, కొండ కింది నుంచి జారి వేగంగా కిందికి పడిపోతున్నట్లు, లోతైన బావిలో జారి పడుతున్నట్లు కల కంటుండగానే ఉన్నట్లుండి మెలకువ వస్తుంది. మెలకువ వచ్చినా మీ శరీరం స్పృహలో ఉండదు. గొంతు చించుకుని గట్టిగా అరిచానని అనుకుంటారు. కాని అరుపు గొంతులోనే ఉంటుంది కాని బయటకు రాదు. నవరంధ్రాలు స్తంభించిపోయినట్లు, నరాలు ఎక్కడి కక్కడ పట్టేసినట్లు మీరు కదల్లేరు మెదల్లేరు. కానీ మెలకువ అయితే ఉంటుంది. ఇలాంటి స్థితి గ్రామీణ ప్రాంతాల్లో అనేకమందికి కలిగే ఉంటుంది.
 
20 లేదా 30 ఏళ్ల క్రితం అయితే ఇలా మెలకువతో ఉన్నప్పటికీ శరీరాన్ని చివరకు కాళ్లు, చేతులను కూడా కదలించకుండా పోయే స్థితిని ఇళ్లలో పెద్దలు గ్రహం పూనిందని, అతీత శక్తి ఏదో వచ్చి మీద కూర్చుని మిమ్మల్ని గట్టిగా పట్టి ఉంచిందని చెప్పేవారు. మరికొందరయితే గువ్వ తొక్కింది అనేవారు. మిత్తి వచ్చి వాలింది అనేవారు. మిత్తి అంటే మృత్యువు అని అర్థం. వీటిలో గువ్వ తొక్కింది అనే పదం విచిత్రమైనది. మగ పక్షి ఏదైనా తన జంటపక్షితో సంభోగించినప్పుడు ఆడపక్షిపైన కూర్చుని తన కాలి రెక్కలతో గట్టిగా నేలకేసి అదిమి దాన్ని ఎటూ కదలకుండా తొక్కి పట్టి ఉంచుతుంది కదా. అలాగా మృత్యువు నీ మీద వాలి నిన్ను కదలకుండా ఉంచుతుందని, అలాంటప్పుడు కొన్ని క్షణాలు మీరు మతిలో ఉన్నా ఏరకంగానూ కదల్లేరని పెద్దలు చెప్పేవారు. కొన్ని రకాల దెయ్యాలు అలా అదృశ్యంగా మనిషిపై వాలి గువ్వ తొక్కి ఉంచినట్లు శరీరాన్ని గట్టిగా తొక్కి ఉంచుతాయని చెబుతుంటారు
 
ఒక్కసారి అలా కదల్లేని పరిస్థితి నుంచు బయటపడ్డాక ఆ షాక్ ఎంత ప్రభావం వేస్తుందంటే జీవితంలో అలాంటి స్థితి మళ్లీ రాకూడదనుకుంటారు. అలాగే.. నిద్రపోయినప్పుడు పిలిస్తే కొంతమంది ఇట్టే లేస్తారు. ఒక్కసారి ముట్టుకుంటే చాలు ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు. కానీ అతి తక్కువ శాతం మంది మాత్రం ఎంత పిలిచినా ఉలకరు పలకరు. మెలకువ వచ్చినా లేవలేరు కూడా. దీనినే ఆధునిక వైద్యం స్లీప్ పెరాలసిస్ అని చెబుతోంది. పెరాలసిస్ వ్యాధిగ్రస్థులు మంచం మీద నుంచి లేవలేరని తెలుసు కదా.. స్లీప్ పెరాలసిస్ (Sleep Paralysis) లక్షణాలు ఉన్నా అంతే! నిద్రలో నుంచి మెలకువ వచ్చినా సరే.. లేచి కూర్చోలేకపోవడాన్నే స్లీప్ పెరాలసిస్ అంటారు. 
 
మగత నిద్రలో ఉండి, కాళ్లు, చేతులు పట్టేసినట్లు ఉండి శరీరం మొత్తం అచేతన స్థితిలోకి వెళ్లిపోతుంది. అయితే కొద్దిసేపటికి దానికదే మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది కూడా. ఇలాంటి నిద్ర రోగం వల్ల నష్టం ఏమీ లేకున్నా, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం కొంచెం కష్టమేనని డాక్టర్లు చెబుతున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి లక్షణాలను ‘దయ్యం మనిషిని లేవకుండా కిందకు నెట్టేస్తోంది’ అని భావిస్తుంటారు. మెక్సికోలో అయితే, ‘మరణమే మనిషిపై కూర్చుని ఉంది’ అని చెప్పుకుంటుంటారు. అక్కడి ఆచారాల ప్రకారం పూజలు పునస్కారాలు కూడా చేస్తుంటారు.
 
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments