Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటి దుర్వాసన తొలగిపోవాలంటే? అరకప్పు పెరుగు తిని.. గ్లాసుడు నీళ్లు తాగేయండి..

పెరుగును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా నోటి దుర్వాసన దూరమవుతుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్‌తో పాటు నోటి దుర్వాసనను దూరం చేసే బ్యాక్టీరియా ఇందులో ఎక్కువగా ఉంటుంది. బయటకు వెళ్లేముందు అరకప్పు లేదా నాలుగైదు

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (13:10 IST)
నోటి దుర్వాసన సమస్య వేధిస్తుందా? అయితే రోజూ ఓ ఆపిల్ పండును నమిలి తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆపిల్‌లోని రకరకాల యాసిడ్లు.. నోటిలోని హానికారక బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు నోటిని తాజాగా ఉంచుతుంది. తద్వారా దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.

అలాగే పెరుగును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా నోటి దుర్వాసన దూరమవుతుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్‌తో పాటు నోటి దుర్వాసనను దూరం చేసే బ్యాక్టీరియా ఇందులో ఎక్కువగా ఉంటుంది. బయటకు వెళ్లేముందు అరకప్పు లేదా నాలుగైదు చెంచాల పెరుగును తిని గ్లాసు మంచి నీళ్లు తాగి చూడండి.. నోటి దుర్వాసన తొలగిపోతుంది. 
 
ఇక గ్రీన్ టీ, లవంగాలు కూడా నోటి దుర్వాసనను తొలగించడంలో బాగా పనిచేస్తాయి. గ్రీన్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటుంది, తద్వారా గ్రీన్‌ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని ఫాలీఫెనాల్స్‌ లాలాజలంలోని దుర్వాసనతో పోరాడతాయి. తద్వారా నోటిని తాజాగా ఉంచేందుకు ఉపయోగపడతాయి.

అలాగే చాలామంది నోటి దుర్వాసనని దూరం చేసుకోవడానికి చూయింగ్‌గమ్‌ అదే పనిగా నములుతుంటారు. వాటికి బదులు నాలుగు లవంగాలు బుగ్గన ఉంచుకుంటే ఆ తాజాదనం చాలా సేపు ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments