Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరి అన్నానికి బదులు వీటిని తీసుకుంటే ఆ వ్యాధులకు దూరం...

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (13:52 IST)
ప్రస్తుతకాలంలో చాలామంది రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. వీటికి కారణం మనం  ప్రతిరోజు తీసుకునే  ఆహారం. ముఖ్యంగా మనం తినే వరి అన్నం కారణంగా మనకు వ్యాధులు వస్తున్నాయని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. దీనిలో గ్లూకోజ్ శాతం ఎక్కువుగా ఉండటం వలన డయాబెటీస్ వంటి వ్యాధులు వస్తున్నాయి.

ఈ రోగాలబారి నుంచి బయటపడాలంటే మనం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి ఏమిటంటే.... చిరుధాన్యాలుగా చెప్పబడే కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, సామలు, ఊదలు లాంటి ధాన్యాలను తీసుకోవడం వలన మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభించటమే కాకుండా అన్ని రకాల రోగాల నుంచి బయటపడవచ్చు. వీటి గురించి మరింత తెలుసుకుందాం.
 
కొర్రలు... కొర్రలలో అధిక పీచుపదార్ధం, మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరంతో పాటు విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మధుమేహవ్యాధి ఉన్నవారికి చక్కని ఔషధంలా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. దీనిలో పీచు పదార్థం అధికంగా ఉండటం వలన మలబద్దక సమస్యను నివారిస్తుంది. కొర్రగంజి తాగడం వలన జ్వరం కూడా తగ్గిపోతుంది. ఇనుము అధికంగా ఉండటం వలన రక్తహీనతకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. గుండెజబ్బులు, కీళ్లవాతం, ఊబకాయం, రక్తస్రావం, గాయాలు త్వరగా మానడానికి కొర్రలు తినడం వలన మంచి ప్రయోజనం  ఉంటుంది.
 
సామలు... సామలు తియ్యగా ఉంటాయి. వీటిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వలన గుండెల్లో మంటగా ఉండటం, పుల్లత్రేన్పులు రావడం, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. మైగ్రేన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పురుషుల శుక్ర కణాల వృద్ధికి, ఆడవారి రుతు సమస్యలకు మంచిది.
 
ఊదలు..... ఊదలతో తయారుచేసిన ఆహారం బలవర్ధకమైనది. చాలా సులభంగా జీర్ణమవుతుంది. పీచుపదార్ధం ఎక్కవుగా ఉండటం వలన మలబద్దక సమస్య నివారించబడుతుంది. దీనిలో ఇనుము ఎక్కవుగా ఉండటం వలన బాలింతలకు పాలు బాగా వస్తాయి.
 
అండుకొర్రలు.... అండుకొర్రలను కనీసం 4 గంటలు నానబెట్టిన తర్వాత వండుకోవాలి. ఇది ఆర్ధ్రయిటిస్, బి.పి., థైరాయిడ్, ఊబకాయం, కంటి సమస్యలను నివారించడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
 
అరికెలు... అరికెలు తీపి, వగరు, చేదు రుచులను కలిగి ఉంటాయి. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, పోషకవిలువలు ఎక్కవుగా ఉండటం వలన పిల్లలకు మంచి ఆహారం. వీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తినడం వలన క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తాయి. దీనిలో పీచుపదార్ధం పుష్కలంగా ఉండటం వలన బరువు తగ్గడానికి చక్కగా ఉపకరిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తర్వాతి కథనం
Show comments