సెల్‌ఫోన్‌లో అదే పనిగా మాట్లాడుతున్నారా? మొటిమలు తప్పవట బీ కేర్ ఫుల్..

సెల్ ఫోన్‌లో గంటల పాటు మాట్లాడుతున్నారా? అయితే మొటిమలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎలాగంటే..? సెల్ ఫోన్ స్క్రీన్‌పై బ్యాక్టీరియాలు ఎక్కుగా ఉంటాయి. సెల్ ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతు

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (10:30 IST)
సెల్ ఫోన్‌లో గంటల పాటు మాట్లాడుతున్నారా? అయితే మొటిమలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎలాగంటే..? సెల్ ఫోన్ స్క్రీన్‌పై బ్యాక్టీరియాలు ఎక్కుగా ఉంటాయి. సెల్ ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు అందులో ఉండే బ్యాక్టీరియా ముఖంపైకి చేరి.. మొటిమలకు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి మొబైల్‌ని రెండురోజులకోసారయినా శుభ్రం చేయడం మంచిది.
 
అలాగే మనం నిద్రించే దిండులపై మురికి, దుమ్మూ పేరుకుపోతుంది. వాటిపై నిద్రించడం ద్వారా చర్మంలోకి బ్యాక్టీరియా పెరిగి.. చర్మంలోకి చేరుతుంది. తద్వారా మొటిమలు ఎదురవుతాయి. దిండు కవర్లను వారానికి ఓసారి శుభ్రం చేయాలి. 
 
ఇక మేకప్‌ బ్రష్‌లు కూడా బ్యాక్టీరియాకి ఆవాసాలే. వాటితో మేకప్‌ వేసుకున్నప్పుడల్లా అదే బ్యాక్టీరియా ముఖంలోకి చేరుతుంది. దాంతో మొటిమలు మొదలవుతాయి. ఆ సమస్యను తగ్గించుకోవాలంటే కనీసం వారానికోసారి మేకప్‌ బ్రష్‌లూ, స్పాంజిలను కడగాల్సి ఉంటుంది.
 
చర్మం జిడ్డుగా ఉన్నప్పుడు అదేపనిగా యాస్ట్రింజెంట్‌ టోనర్లూ, క్లెన్సర్లూ వాడతారు కొందరు. దానివల్ల చర్మం పొడిబారుతుంది. అది కూడా కొన్నిసార్లు మొటిమలకు కారణం కావచ్చు. కాబట్టి జిడ్డు సమస్యతో బాధపడేవారు గాఢత తక్కువగా ఉండే టోనర్లూ, మొటిమల సమస్యను అదుపులో ఉంచే క్లెన్సర్లే వాడాలని బ్యూటీషన్లు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్త - పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య - అత్త

ప్రభుత్వ ఉద్యోగాలు.. వయోపరిమితిని 44కి పెంచనున్న తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

నారా లోకేష్‌కు ఎక్కువ మంది పిల్లలు వుండాలని భావిద్దాం, బావ ఫోటో పెట్టావు: పూనమ్ కౌర్ ట్వీట్

Yash: టాక్సిక్ సెట్ నుండి రాయా గా అద్భుతమైన స్టిల్‌ తో యష్

Purusha : ఆద్యంతం వినోదభరితంగా పురుష:ట్రైలర్

తర్వాతి కథనం
Show comments