Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరం వచ్చినపుడు చికెన్ తింటే ఏమవుతుంది?

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (12:55 IST)
మనిషి ఆరోగ్యానికి మంచి ఆహారం చాలా అవసరం. అయితే కల్తీ ఎక్కువ పెరగడంతో ఫుడ్​లో క్వాలిటీ తెలియట్లేదు. ఇక కొరియర్​ సర్వీసులు, ఫుడ్ కంపెనీలు ఎక్కువవడంతో ఇంట్లో వండుకోవడం కూడా చాలామంది తగ్గించేశారు. జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ప్రశ్న రోగులను వేధిస్తూ ఉంటుంది.
 
మనిషి ఆరోగ్యానికి మంచి ఆహారం చాలా అవసరం. అయితే కల్తీ ఎక్కువ పెరగడంతో ఫుడ్​లో క్వాలిటీ తెలియట్లేదు. ఇక కొరియర్​ సర్వీసులు, ఫుడ్ కంపెనీలు ఎక్కువవడంతో ఇంట్లో వండుకోవడం కూడా చాలామంది తగ్గించేశారు. ఇలాంటివే అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. మనిషి బలహీనంగా ఉన్న సమయంలోనూ.. ఏదైనా వ్యాధి బారినపడినప్పుడు న్యూట్రియంట్స్ అన్నీ ఉండే మంచి బ్యాలెన్స్డ్ ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

అలా తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నీరసం తగ్గి.. మళ్లీ తిరిగి శక్తివంతులౌతారు. జ్వరం వచ్చినప్పుడు కూడా వైద్యులు కొద్దిగా లైట్ ఫుడ్ తీసుకోమని చెబుతారు. లైట్ ఫుడ్ తీసుకుంటే అరుగుదల మంచిగా ఉంటుందని.. దాని వల్ల ఎలాంటి సమస్య ఉండదు అని వారు అలా చెబుతారు.

జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ప్రశ్న రోగులను వేధిస్తూ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడే కాదు జ్వరం  తగ్గినప్పుడు కూడా ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి.
 
పప్పులు బెటర్​
జ్వరం లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్లు రక్తంపై ఎటాక్ చేస్తాయి. జ్వరం వస్తే పోషకాలు అధికంగా ఉన్న ద్రవాహారం తీసుకోవాలి. సూప్స్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవడం ఉత్తమం. జామ, బొప్పాయి, నారింజ, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ లాంటి పండ్లు తీసుకుంటే వాటిలో ఉండే విటమిన్లు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఇన్‌ఫెక్షన్ల ను తట్టుకునేలా చూస్తాయి.

పాలు, పెసర, మొలకెత్తిన గింజలు, కందిపప్పు లాంటి ఆహారాలు జ్వరం వచ్చిన సమయంలో తీసుకుంటే శరీరంలో ప్రోటీన్లు పెరుగుతాయి. మరీ నీరసంగా ఉంటే తక్షణ శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.
 
 
అన్నం తప్పనిసరి
అన్నం, బెల్లం, తేనె, అరటిపండ్లు తక్షణ శక్తిని ఇచ్చి నీరసాన్ని తగ్గిస్తాయి. జ్వరం వచ్చిన సమయంలో, తరువాత చిన్న పిల్లలు ఆహారంతో పాటు లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి. అల్పాహారంతో పాటు ఒక గుడ్డు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ఉదయం పూట పాలతో పాటు నాలుగు ఖర్జూరాలు తీసుకుంటే మంచిది. రాజ్మా, శనగలు, రాగితో చేసిన లడ్డూలను స్నాక్స్ రూపంలో తీసుకోవడం ఉత్తమం.
 
జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం తింటే  అది మనకు ప్రమాదమని  చాలామంది అంటున్నారు. మటన్, చికెన్, చేపలు వంటి వాటిని తినడం వలన ఆరోగ్యం చెడిపోతుందని అంటున్నారు. కాని దీనిని ఎవరూ పట్టించుకోకుండా నాన్ వెజ్ పై ఎక్కువగా ఇష్టం ఉన్నవారు  తింటూనే ఉంటారు.

మరికొందరైతే  కనీసం దాని జోలికి కూడా పోరు. సాధారణంగా మనకు జ్వరం వచ్చినప్పుడు ఈ చికెన్ లాంటి ఫుడ్ తింటే పచ్చకామెర్ల వ్యాధులు వస్తాయని అంటుంటారు. మనకు ఫీవర్ వచ్చినప్పుడు  జీర్ణక్రియ సరిగా పని చేయదు కాబట్టి వైద్యులు కూడా నాన్ వెజ్ తినకూడదంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

తర్వాతి కథనం
Show comments