Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంటీ బయాటిక్స్‌ వాడకం... దుష్ఫలితాలు ఇలాంటివే...

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2016 (14:42 IST)
యాంటీబయాటిక్‌ మందుల వాడకం వల్ల మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం పడే అవకాశమున్నట్లు ఓ నూతన అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం చేసిన పరిశోధకుల బృందంలో హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త షామిక్‌ భట్టాచార్య కూడా ఉన్నారు. యాంటీబయాటిక్స్‌ వాడిన రోగుల్లో మానసిక గందరగోళం(డెలీరియం), లేనివి ఉన్నట్లు కనిపించడం, వినిపించడం, భ్రమలు కలగడం(హాలూసినేషన్స్‌) వంటి లక్షణాలు ఉత్పన్నమైనట్లు భట్టాచార్య తెలిపారు. 
 
డెలీరియం వచ్చిన వ్యక్తులు ఇంటికి వెళ్లబోయి ఆస్పత్రికి వెళ్తారని, తీవ్ర గందరగోళంలో ఉంటారని, డెలీరియం రాని రోగితో పోల్చితే ఇది వచ్చిన వారు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని భట్టాచార్య చెప్పారు. యాంటీబయాటిక్స్‌ వాడటం వల్ల డెలీరియం వచ్చిన 391 మంది రోగులపై అధ్యయనాలు చేసి.. డెలీరియం తీవ్రతను బట్టి మూడు విభాగాలు చేశామన్నారు. సల్ఫోనమైడ్లు, సిప్రోఫ్లోక్సాసిన్‌, పెనిసిల్లిన్‌, సెఫెపీం, మెట్రోనిడజోల్‌ వంటి 57 యాంటీబయాటిక్‌ మందులు, రోగుల్లో డెలీరియం లక్షణాలను కలిగించినట్లు తెలిపారు. ఈ అధ్యయనాన్ని జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ ప్రచురించింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

Show comments