Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడికాయలు ఎందుకు తినాలి?

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (18:10 IST)
వేసవి రాగానే బంగారం రంగులో వుండే మామిడికాయలు వచ్చేస్తాయి. ఈ మామిడిలో కేలరీలు తక్కువగా ఉన్నాయి. పోషకాలు ఎక్కువగా ఉన్నాయి - ముఖ్యంగా విటమిన్ సి వుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మామిడి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
 
ఈ పండులో వుండే విటమిన్లు మరియు ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతుంది. వృద్దాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది.శృంగారంలో ఆసక్తి లేనివారికి శృంగార వాంఛను కలిగిస్తుంది.
 
మామిడిపండులో శరారంలోని రోగనిరోధక శక్తిని పెంచే బిటాకెరోటిన్ అనే పదార్దం సమృద్దిగా ఉంది, ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది. మామిడి పండును తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి. నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృడంగా ఉంటుంది.
 
మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబందిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది. దానిలో ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్తకణాల వృద్దికి దోహదపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విమానాశ్రయ చెత్తబుట్టలో శిశువు మృతదేహం!!

Hyderabad: వేడి నీళ్లతో నిండిన బకెట్‌లో పడి నాలుగేళ్ల బాలుడి మృతి

పారిశుద్ధ్యం కార్మికుల వేషంలో యూట్యూబర్ ఇల్లు ధ్వంసం... ఇంట్లో మలం వేశారు..

Rajini: ఎంపీ లావు కృష్ణ దేవ రాయలకు పూర్తి వడ్డీతో తిరిగి చెల్లిస్తాను.. రజనీ స్ట్రాంగ్ వార్నింగ్

వైకాపా హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్‌పై హోం మంత్రి అమిత్ షా ఆరా!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

తర్వాతి కథనం
Show comments