Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలనుకునేవారు.. నూనెల్ని బాగా తగ్గించి.. పండ్లు, కూరగాయలు తీసుకోండి..

బరువు తగ్గాలనుకునే వారు అన్నం మానేయడం కాదు.. నూనెలు, చక్కెర్లు మానేస్తేనే ఫలితం ఉంటుంది. వీటివల్లే మన శరీరానికి అవసరమైన కొవ్వులు అందుతాయనే మాట నిజం. అన్నం ద్వారా లభించే కార్బోహైడ్రేట్లనే మానేసి వూరుకు

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (10:37 IST)
బరువు తగ్గాలనుకునే వారు అన్నం మానేయడం కాదు.. నూనెలు, చక్కెర్లు మానేస్తేనే ఫలితం ఉంటుంది. వీటివల్లే మన శరీరానికి అవసరమైన కొవ్వులు అందుతాయనే మాట నిజం. అన్నం ద్వారా లభించే కార్బోహైడ్రేట్లనే మానేసి వూరుకుంటే సరిపోదు. కార్బొహైడ్రైట్‌ అధికంగా ఉండే కాయగూరలూ, పండ్లూ, ధాన్యాలూ కూడా పోషకాహారంలో భాగమేనని గుర్తుంచుకోవాలి.
 
బరువు తగ్గాలన్న తాపత్రయంలో అల్పాహారం, భోజనం మానేయడం వల్ల రోజంతా ఆకలితో ఉంటారు. ఫలితంగా ఒక్కసారిగా అధికంగా తినేస్తారు. లేదంటే చిరాకు, అసహనం వంటివీ ఎదురవుతాయి. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. క్రమంగా మీ జీవక్రియ రేటు పడిపోతుంది. అందుకే వీలైతే ఒక భోజనాన్ని ఒకేసారి తినడం కంటే మూడు సార్లు తినడం మంచిది. 
 
పీనట్‌ బటర్‌, చీజ్‌ తురుములను రోజుకి స్పూన్‌లో తీసుకోవడం మంచిది. వయసూ, బరువుని బట్టే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆరోగ్యవంతమైన మహిళ సగటున రోజుకి 60 గ్రాములు పప్పూ, 50 గ్రాముల వరకూ మాంసం తీసుకోవచ్చు. అన్నం, రాగులూ, జొన్నలూ, పాస్తా ఏవి తిన్నా సరే రోజుకి 270గ్రా నుంచి మూడొందల గ్రాములు మించకుండా తీసుకోవాలి. నూనెల్ని బాగా తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments