Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ ముద్దలేనిదే వీకెండ్ పొద్దు గడవదా? కాలేయ సమస్యలు తప్పవు!

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2016 (11:57 IST)
పుట్టిన రోజు వేడుకలు, పెళ్ళి రిసెప్షెన్, వీకెండ్ పార్టీల్లో బిర్యానీ ముద్దలేనిదే పొద్దు గడవదు. ప్రస్తుతం వీకెండ్‌లో బిర్యానీ తినకుండా ఉండలేకపోతున్నారా... అయితే మీకు కాలేయ సమస్యలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇదేంటి ఆల్కహాల్ తాగితేనే కదా కాలేయ సమస్యలు వస్తాయని అందరూ అనుకుంటారు. 
 
కేవలం బిర్యానీ లాగిస్తే కాలేయ సమస్యలు వస్తాయా ఎలా అనుకుంటున్నారా? అయితే చదవండి మరి. ఆల్కాహాల్ ప్రభావంతో వచ్చే కాలేయ సమస్యలు.. అతిగా చికెన్, మటన్ బిర్యానీలు లాగించేసినా వస్తాయట. బిర్యానీతోపాటు తీసుకునే కూల్ డ్రింక్‌ల ప్రభావంతో ఈ కాలేయ సమస్యలు మరింత ఎక్కువవుతాయని తాజా పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
బిర్యానీల్లో వనస్పతి, నెయ్యి, డాల్డా, మసాలా వంటి దినుసులను ఎక్కువగా వాడటం, కొన్ని రెస్టారెంట్లలో క్వాలిటీ లేని మాంసాన్ని ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయని పరిశోధకులు తెలిపారు. ఒక్క బిర్యానీని తింటే సుమారు 500 కేలరీలు చేరతాయని, అంత భారీ మొత్తంలో కేలరీలు మనిషికి ఒకేసారి అవసరం లేదంటున్నారు.
 
ఎలాంటి మద్యం అలవాట్లు లేకపోయినా.. ఆల్కహాల్ ప్రభావంతో వచ్చే కాలేయ సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రతీ ఏడాది 30 నుంచి 35 శాతం పెరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారట. నగరాల్లో వీరి సంఖ్య మరీ ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. 
 
వారం వారం క్రమం తప్పకుండా బిర్యానీని ఫుల్లుగా లాగించే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అకస్మాత్తుగా కడుపునొప్పి రావడం, ఛాతినొప్పి, నీరసం వంటి లక్షణాలతో నీరు ఆస్పత్రి మెట్లెక్కుతున్నారని పరిశోధనలో తేలిపోయింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

Show comments