Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో కూరగాయలు అధికంగా ఎందుకు తీసుకోవాలి? టమోటా, క్యాబేజీ సూప్ తాగితే?

వేసవిలో కూరగాయలను అధికంగా డైట్‌లో చేర్చుకోవాలి. ఎండవేడిమిని తగ్గించే గుణాలు కూరగాయల్లో పుష్కలంగా ఉన్నాయి. వేసవి అనగానే ఫ్రిజ్‌లో ఉంచే కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్‌ను తాగకుండా.. బదులుగా పండ్లు కాయగూరలను ఆ

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (18:18 IST)
వేసవిలో కూరగాయలను అధికంగా డైట్‌లో చేర్చుకోవాలి. ఎండవేడిమిని తగ్గించే గుణాలు కూరగాయల్లో పుష్కలంగా ఉన్నాయి. వేసవి అనగానే ఫ్రిజ్‌లో ఉంచే కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్‌ను తాగకుండా.. బదులుగా పండ్లు కాయగూరలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యం లభిస్తుంది. ముఖ్యంగా వేసవిలో నీటిని ఎక్కువగా తీసుకోవాలి. తలనొప్పి, కండరాల నొప్పి, కిడ్నీ సమస్యలు, లోబీపికి చెక్ పెట్టాలంటే.. నీటిని అధికంగా తీసుకోవాల్సిందే. 
 
శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా పనిచేయాలంటే.. నీరు తప్పనిసరి. రోజుకు 3 లీటర్ల నీటిని సేవించాలి. వేసవిలో అదనంగా మరో లీటరును సేవించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నీటితో పాటు నీటిశాతం ఎక్కువగా గల కూరగాయలను తీసుకోవాలి. అవేంటో చూద్దాం.. కీరదోసలో నీటిశాతం ఎక్కువ ఉంటుంది. ఇందులో పొటాషియం, కాపర్, విటమిన్ సి, కె, బి వంటివి పుష్కలంగా ఉన్నాయి. వీటిని రోజుకు రెండైనా తినాలి. టమోటాలో 94శాతం నీరు వుంది. బీటా కెరోటిన్, ఫోలేట్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఇ ధాతువులున్న టమోటాను అలానే తీసుకోవాలి. లేదంటే జ్యూస్, సూప్‌ల రూపంలో తీసుకోవచ్చు. పుచ్చకాయను రోజూ తీసుకోవాలి.  
 
ప్రతీ నాలుగు గంటలకు ఒకసారి రెండు కప్పుల పుచ్చకాయ ముక్కల్ని తీసుకోవాలి. ఇందులో విటమిన్ ఎ, సి, డీ,  బి-6, బీ-13తో పాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీలో విటమిన్ సీ, కే, పీతో పాటు.. ఫోలేట్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, క్యాల్షియం వంటి ధాతువులున్నాయి. క్యాబేజీని సలాడ్‌తో పాటు జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 92 శాతం ఇందులో నీటిశాతం దాగివుంది.
 
అంతేగాకుండా విటమిన్ ఎ, బి, సి, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇందులోని పోషకాలు ఉదర సమస్యలను, మలేషియా, పచ్చకామెర్ల కారకాలను నశింపజేస్తాయి. క్యాలీఫ్లవర్ కూడా ఎండ వేడిమిని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్, ఎ, బి, సి, కే మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం వంటి ధాతువులున్నాయి. ఇవి క్యాన్సర్, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, అజీర్తికి సంబంధించిన సమస్యలను దరిచేరనివ్వదు. బ్రొకోలీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. క్యాన్సర్ కారకాలపై  పోరాడుతుంది. ఇందుకు బ్రొకోలీలోని ఫాస్పరస్, సెలీనియం, విటమిన్ ఎ, సీ, కే, బీ6, పొటాషియం, మాంగనీస్ వంటివే కారణమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments