Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో ప్రతిరోజూ రసం అన్నం తినాల్సిందే... ఎందుకు?

వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే.. బెండ, సొరకాయలూ, చేమదుంపలూ తీసుకోవాలి. కాకరకాయ తింటే హాని చేసే పలు ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. దానిమ్మ, అరటి, బొప్పాయి తీసుకోవడం వల్ల అవసరమైన పోషకాలు అందుతాయి. ఇం

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (13:40 IST)
వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే.. బెండ, సొరకాయలూ, చేమదుంపలూ తీసుకోవాలి. కాకరకాయ తింటే హాని చేసే పలు ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. దానిమ్మ, అరటి, బొప్పాయి తీసుకోవడం వల్ల అవసరమైన పోషకాలు అందుతాయి. ఇంకా వర్షాకాలంలో జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు ప్రతిరోజూ రసం అన్నం తింటే మంచిది. రసంలోని టమోటాలు, చింతపండు, మిరియాలు, కరివేపాకులో పోషకాలు పుష్కలం. 
 
అందుకే రసం తీసుకోవడం ద్వారా శరీరానికి అందుతాయి. టొమాటోల్లో యాంటీఆక్సిడెంట్లూ, విటమిన్‌ సి ఉంటాయి. ఇవి రోగనిరోధశక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇన్‌ఫెక్షన్లను అదుపులో ఉంటాయి. జబులు, దగ్గు వంటివి దరిచేరవు. బరువు తగ్గేవారికి ఇది మంచి ఆహారం. శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. జీవక్రియ రేటు మెరుగుపడుతుంది.
 
అలాగే వర్షాకాలంలో రోజూ అల్లం టీలో, నిమ్మరసం తేనె కలుపుకుని తీసుకుంటే బరువు తగ్గుతారు. వర్షాకాలంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ టీ చక్కటి పరిష్కారం చూపుతుంది. టీలో లభించే పోషకాలు కీళ్లు, కండరాలను దృఢం చేస్తాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమాన్నిస్తాయి. శ్వాసకోశ సంబంధ సమస్యలూ ఇబ్బందిపెట్టవు. 
 
ఉదయం పూట వికారంగా అనిపించినా తగ్గుతుంది. ఇంకా కూరల్లో పసుపు, మెంతులూ, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇవి పలు రకాల ఇన్‌ఫెక్షన్లతో పోరాడతాయి. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

తర్వాతి కథనం
Show comments