Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవంతంగా 150 గుండె ఆపరేషన్‌లు పూర్తి చేసిన ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి

చెన్నైలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. గత యేడేళ్ళ కాలంలో 150 గుండె మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దక్షిణాసియాలోనే ఈ

Webdunia
బుధవారం, 10 మే 2017 (16:50 IST)
చెన్నైలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. గత యేడేళ్ళ కాలంలో 150 గుండె మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దక్షిణాసియాలోనే ఈ తరహా ఫీట్‌ను సాధించిన తొలి కార్పొరేట్ ఆస్పత్రిగా మలర్ ఆస్పత్రి రికార్డుపుటలకెక్కింది. పైగా, ఈ ఆస్పత్రిలో గుండె మార్పిడి ఆపరేషన్ల సక్సెస్ రేటు 90 శాతంగా ఉండటం గమనార్హం.
 
ఈ ఆస్పత్రికి చెందిన కార్డియాక్ సైన్సెస్, ఫోర్టిస్ సెంటర్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ డైరక్టర్ డాక్టర్ కేఆర్. బాలకృష్ణన్, కార్డియాక్ అనెస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ విభాగం అధిపతి డాక్టర్ కేజీ సురేష్ రావులు సారథ్యంలోని వైద్యబృందం ఈ ఘనతను సాధించాయి. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టర్ కేఆర్ బాలకృష్ణన్ మాట్లాడుతూ... అవయవాల కొరతకు సమాధానాన్ని తమిళనాడులో భారత్ కనుగొందన్నారు. తమ ఆస్పత్రి యాజమాన్యంతో పాటు వైద్యు, సహాయక సిబ్బంది సహకారంతో 150 గుండె మార్పిడి ఆపరేషన్లు పూర్తి చేసినట్టు తెలిపారు. వీరందరికి కంటే ముందుగా అవయవాలనుదానం చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించాల్సి ఉందన్నారు. దాతలు ముందుకు రావడం వల్లే ఈ అరుదైన ఫీట్‌ను సాధించినట్టు తెలిపారు. 
 
కాగా, ప్రభుత్వ గణాంకాల మేరకు.. వివిధ సమస్యతో బాధపడుతున్న వారి ప్రాణాలను రక్షించాలంటే ప్రతి యేడాది 2 లక్షల కిడ్నీలు, 30 వేల కాలేయాలు, 50 వేల గుండె అవయవాలను సేకరించాల్సి ఉందన్నారు. అందేసమయంలో దేశంలో నాన్ కమ్యూనబలు వ్యాధుల బారిన పడి మృతి చెందే వారి సంఖ్య పెరుగుతుందని, దీంతో అవయవదానంపై అవగాహన పెరుగుతుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఎన్.సి.డి బారిన పడి 5.87 మిలియన్ల మంది చనిపోతుండగా, వీరిలో 60 శాతం మంది ఒక్క భారత్‌లోనే మృత్యువాత పడుతున్నారని ఆయన తెలిపారు. 
 
కాగా, అవయవదానంలో తమిళనాడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందన్నారు. జాతీయ స్థాయిలో అవయవదానం రేటు గత 2014 సంవత్సరంలో 0.34 శాతంగా ఉందన్నారు. గత 2012 సంవత్సరంతో పోల్చుకుంటే  ఇది ఎంతో మేలన్నారు. కాగా, ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి 9 యేళ్ళ రష్యా బాలుడికి విజయవంతంగా గుండె ఆపరేషన్ చేయడం జరిగింది. అలాగే, 78 యేళ్ళ వృద్ధుడికి గుండె మార్పిడి ఆపరేషన్ చేసి చరిత్ర సృష్టించింది.
 
అంతేకాకుండా, దేశంలోని తొలి ఇంటర్ స్టేట్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపేరషన్‌ను పూర్తి చేసింది. గత 2015 ఆగస్టు నెలలో కేవలం రెండు వారాల వ్యవధిలో మూడు ఇంటర్ స్టేట్ హార్ట్ స్టేట్ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. ముఖ్యంగా 30 శాతం విదేశీ రోగులకు చివరి దశలో చికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించింది. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులతో పాటు.. సిబ్బంది, పలువురు పేషంట్లు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఎస్ఐ (Video)

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

తర్వాతి కథనం
Show comments