Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున టమోటా జ్యూస్ తాగొద్దు.. స్వీట్లు తిన్నారో అంతే సంగతులు..!

అవునా పరగడుపున టమోటా జ్యూస్ తాగకూడదా? పరగడుపున టమోటా జ్యూస్ తాగితే ఏమౌతుంది?అనేదేగా మీడౌట్. అయితే చదవండి. టమోటాలు ఆకలిని పెంచుతాయి. అందుకే భోజనానికి ముందు టమోటా సూప్ తాగుతారు. భోజనానికి ముందు కాకుండా

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (12:52 IST)
అవునా పరగడుపున టమోటా జ్యూస్ తాగకూడదా? పరగడుపున టమోటా జ్యూస్ తాగితే ఏమౌతుంది?అనేదేగా మీడౌట్. అయితే చదవండి. టమోటాలు ఆకలిని పెంచుతాయి. అందుకే భోజనానికి ముందు టమోటా సూప్ తాగుతారు. భోజనానికి ముందు కాకుండా ఖాళీ కడుపుతో టమోటా జ్యూస్‌ తాగితే మాత్రం అంతే సంగతులని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టమోటాల్లోని టానిక్‌ ఆసిడ్‌లు ఎసిడిటీని పెంచి పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే అరటి పండు శరీరంలో మెగ్నీషియం ఎక్కువైతే గుండె ఆరోగ్యానికి ముప్పు అని నిపుణులు చెప్తున్నారు. అరటి పరగడుపున పండు తింటే శరీరంలో మెగ్నీషియం స్థాయి ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. దీని కారణంగా గుండెనొప్పి లేదా గుండె సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 
 
భోజనానికి ముందు లేదా ఆ తరువాత అరటి పండు తీసుకుంటే మంచి ఫలితాన్నే పొందవచ్చును. అలాగే ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోగానే కొందరికి స్వీటు తినే అలవాటు ఉంటుంది. ఇది చాలా చెడు అలవాటు. దీంతో డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉందని వారు చెప్తున్నారు. ఎలాగంటే....పరగడుపున తీపి పదార్థాలు తినడం వలన శరీరంలో ఇన్సులిన్‌ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీని వలన క్లోమ గ్రంథి మీద అదనపు భారం పడుతుంది. ఈ భారం పెరిగి పెరిగి డయాబెటిస్‌కి దారితీసే అవకాశం కూడా లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments