Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్మోన్ల లోపం వల్లే కళ్లకింద నల్లటి చారలు

పుష్టికరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనడంలో సందేహం లేదు. ఆరోగ్యంతోపాటు చర్మసౌందర్యం కూడా బాగుంటే మరింత అందంగా తయారుకాగలరు. ప్రస్తుతం ఉరుకు పరుగులతో కూడుకున్న జీవితంలో చాలామంది తమ చర్మసౌందర్యంపై ప

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (11:08 IST)
పుష్టికరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనడంలో సందేహం లేదు. ఆరోగ్యంతోపాటు చర్మసౌందర్యం కూడా బాగుంటే మరింత అందంగా తయారుకాగలరు. ప్రస్తుతం ఉరుకు పరుగులతో కూడుకున్న జీవితంలో చాలామంది తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీంతో చర్మ సంబంధిత జబ్బులు తలెత్తుతుంటాయి. ఉదాహరణకు నవ్వ, చర్మం పొడిబారడం, కళ్ళక్రింద నల్లటి చారలు ఏర్పడటం జరుగుతుంటుంది. 
 
అలాగే హార్మోన్ల లోపంతోనూ చర్మంపై ప్రభావం ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి క్రింద పేర్కొనబడిన ఆహార నియమాలను పాటిస్తే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
* ప్రతి రోజు వీలైనంత మేరకు ఎక్కువ నీటిని సేవించాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన చర్మం కోసం నీరు దివ్యమైన ఔషధం. నీరు తీసుకోవడం వలన మీరు తాజాగా తయారవ్వడమే కాకుండా మీ చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో చాలా ఉపయోగపడుతుంది. 
 
* ఏవిధంగానైతే శరీరానికి ప్రాణవాయువు అవసరమో అదేవిధంగా శరీర చర్మానికి విటమిన్ల అవసరమౌతుంది. చర్మసౌందర్యాన్ని పెంపొందించేందుకు కొన్ని విటమిన్లు అవసరమౌతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
1. విటమిన్ సి : విటమిన్ సీ అన్ని రకాల పండ్లలో లభిస్తుంది. ఉదాహరణకు నారింజ, నిమ్మకాయ, చీనీపండు.
 
2. విటమిన్ ఏ : బొప్పాయి, కోడిగుడ్డు
 
3. విటమిన్ బి : ఇది పండ్లతోపాటు ఆకుకూరల్లోను పుష్కలంగా లభిస్తుంది.
 
4. విటమిన్ ఇ : వేరుశెనగ, ఇతర నూనె గింజల్లో లభిస్తుంది.
 
చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కేవలం పండ్లు, ఆకుకూరలతోపాటు నీరు సేవిస్తుంటే చాలని వైద్యులు తెలిపారు. 

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments