Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందారపువ్వును పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టిస్తే..

రోజువారీ పనులతో బిజీగా ఉండి తల గురించి పట్టించుకోకపోతే కొన్నాళ్లకు వెంట్రుకలు జీవం కోల్పోయి అందవిహీనంగా తయారవుతాయి. అందుకే.. కొద్దిగా ఓపికతో చిన్న, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అందుకు కొన్ని చిట

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (11:31 IST)
రోజువారీ పనులతో బిజీగా ఉండి తల గురించి పట్టించుకోకపోతే కొన్నాళ్లకు వెంట్రుకలు జీవం కోల్పోయి అందవిహీనంగా తయారవుతాయి. అందుకే.. కొద్దిగా ఓపికతో చిన్న, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అందుకు కొన్ని చిట్కాలు.. జుట్టు పొడిబారి నిర్జీవంగా ఉంటే ఎగ్ మిక్సింగ్ షాంపూలను ఎంచుకోవాలి. కనీసం రెండు రోజులకోసారి తలస్నానం చేయాలి.
 
జుట్టు మరీ జిడ్డుగా ఉంటే షాంపూ చేసుకోవడానికి ముందు నిమ్మరసాన్ని పట్టించాలి. గంట తర్వాత గోరు నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఆలివ్ ఆయిల్ రాసి తలస్నానం చేస్తే మంచిది. పొడిబారినట్లుగా అనిపిస్తే అలో జెల్‌తో తరచుగా మర్దన చేస్తే శిరోజాలు మృదువుగా మారతాయి. ఎండిన ఉసిరికాయ పొడిలో, ఒక స్పూన్ గోరింటాకు పొడి, మెంతులపొడిని కలపండి. ఈ పొడిలో రెండు స్పూన్ల కొబ్బరి పాలు కలిపి జుట్టుకు పట్టించి ఒక గంటపాటు ఉంచండి. తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నల్లటి, దట్టమైన శిరోజాలు మీ సొంతం. 
 
షాంపూతో తలస్నానం చేసిన తర్వాత రెండు స్పూన్ల వెనిగర్ తీసుకొని తలకి బాగా పట్టించి కడిగేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలు నిగనిగలాడుతూ కనిపిస్తాయి. చుండ్రుతో ఇబ్బందిపడేవారు రాత్రి పడుకునే సమయంలో రెండు టీ స్పూన్ల వెనిగర్‌లో ఆరు టీ స్పూన్ల నీళ్లు కలిపి కుదుళ్లకు పట్టించి తలకు టవల్ చుట్టుకోవాలి. ఉదయం మరోసారి చేసి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. 
 
మందారపువ్వును పేస్ట్‌లా చేసి ఆ రసాన్ని జుట్టంతా పట్టించి తలస్నానం చేస్తే జుట్టు కాంతులీనుతుంది. లేకపోతే మందార ఆకుల్ని పొడికొట్టి అందులో పెరుగు కలిపి తలకు పట్టించినా ఫలితం ఉంటుంది. 

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments