Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో గొంతునొప్పి.. నివారణకు చిట్కాలేంటి?

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2015 (13:24 IST)
సాధారణంగా శీతాకాలంలో(చలికాలంలో) ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు గొంతునొప్పి కూడా వస్తుంది. గొంతులో ఇన్‌ఫెక్ష‌న్‌ కారక సూక్ష్మక్రిములు చేరడం వల్ల గొంతునొప్పిమొదలవుతుంది. ఆ తర్వాత వాయిస్ సరిగ్గా రాకపోవడం, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని నుండి అతి సులభంగా ఉపశమనం పొందాలంటే కొన్ని పాటి ఆహార నియమాలు పాటించినట్టయితే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. 
 
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిళించాలి. ఇలా చేస్తే గొంతునొప్పి మటుమాయం. మనం సాధారణంగా ఇంట్లో వంటకు ఉపయోగించే వస్తువులు గొంతు నొప్పిని కూడా నివారిస్తాయి. ఉదాహరణకు అల్లం టీ గొంతు నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు గొంతు ఇన్ఫెక్షన్‌ను కూడా నివారిస్తుంది.
 
మిరియాల సూపులు కూడా గొంతు నొప్పిని చాలా సులభంగా తగ్గిస్తాయి. ఎక్కువగా గొంతు నొప్పితో బాధపడుతుంటే కనుక గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే గొంతునొప్పితో పాటు, ఇన్ఫెక్షన్ కూడా దూరం చేస్తుంది. గొంతునొప్పి మరీ ఎక్కువగా ఉంటే తేనె మరియు నిమ్మరసం గోరువేచ్చని నీటిలో కలిపి తాగితే మంచి  ఫలితాన్నిస్తుంది.
 
స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల గొంతులో ఇబ్బందిగా అనిపించిన కూడా జలుబు, దగ్గును, గొంతునొప్పికి బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు మిరియాలను సూప్స్‌లోనూ, టీ లో అల్లం చేర్చి తాగడం వల్ల గొంతునొప్పి నుండి విముక్తి కలుగుతుంది. అంతేకాక గొంతునొప్పి ఉండే సమయంలో చల్లని నీరు, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments