Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రక్షాబంధన్‌ వేళ, మీరు అభిమానించే వ్యక్తులకు ఓ బాక్సు నిండా బాదములివ్వండి

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (18:46 IST)
పండుగ సీజన్‌ ప్రారంభానికి సూచికగా నిలిచే మరో మాసమిది. దేశవ్యాప్తంగా కుటుంబాలన్నీ కూడా అత్యంత ఆసక్తిగా రక్షాబంధన్‌ పండుగ వేడుక చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. తోబుట్టువుల మధ్య సంబంధాన్ని గౌరవిస్తూ, రాఖీ కడుతుంటారు. ఇది తోబుట్టువులకు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ, నమ్మకానికి ప్రతీకగా ఇది నిలుస్తుంటుంది.


అంతేకాదు, బహమతులను ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా సంతోషాన్ని వేడుక చేయడానికి సైతం ఈ పండుగ నాడు ఆసక్తిగా చూస్తుంటారు. ఈ పండుగను వేడుక  చేయడానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్న వేళ, పంచుకోబోయే బహుమతులను గురించి లోతుగా ఆలోచించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. మనం అభిమానించే వారి ఆరోగ్యం, శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ఈ రక్షాబంధన్‌ వేళ, మన బంధాన్ని బలోపేతం చేసుకుంటూ ఓ బాక్స్‌ నిండుగా ఆరోగ్యాన్ని బాదముల బాక్సును బహుమతిగా ఇవ్వడం ద్వారా అందించండి.

 
చక్కటి ఆరోగ్య బహుమతి బాదములు. వీటిలో అత్యంత కీలకమైన పోషకాలు అయినటువంటి ప్రొటీన్‌ (6గ్రాములు), ఫైబర్‌ (4గ్రాములు), చక్కటి ఫ్యాట్స్‌ (9.5 గ్రాములు), విటమిన్‌ ఈ (7.7 మిల్లీ గ్రాములు) కాల్షియం (81 ఎంజీ), మెగ్నీషియం( 81ఎంజీ)మరియు ఇతర పోషకాలు ప్రతి 30గ్రాముల బాదములతో పాటుగా లభిస్తాయి. పలు పరిశోధనా అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం మధుమేహ నియంత్రణలో బాదములు తోడ్పడతాయి.

 
అలాగే బరువు నియంత్రణ, కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలకు తగిన పరిష్కారాలనూ బాదములు అందించగలవు. మొక్కల ఆధారిత ప్రొటీన్‌కు శక్తివంతమైన వనరు ఇది మరియు దీర్ఘకాలం పాటు ఒకరి ఆకలిని నిలిపి ఉంచడంలోనూ తోడ్పడుతుంది. రుచికరమైన, ఆరోగ్యవంతమైన బాదములను విభిన్న మార్గాలలో ఆరగించవచ్చు. అవి నేరుగా, రోస్ట్‌ చేసి లేదా ఇతర రుచులను జోడించి లేదా ఏదైనా రెసిపీలో ఇంగ్రీడియెంట్‌గా కూడా జోడించవచ్చు. ఈ గింజలు అందించే ఆరోగ్య ప్రయోజనాల రీత్యా ఈ రక్షా బంధన్‌ వేళ బహుమతిగా అందించడానికి ఖచ్చితమైన బహుమతి అవకాశంగా బాదములు నిలుస్తాయి.

 
న్యూట్రిషన్‌ మరియు వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ‘‘ వేడుక, ఆచారం, షాపింగ్‌, మరియు అధికంగా స్నాక్స్‌ మరియు స్వీట్ల ఆరగింపు రక్షాబంధన్‌ వేళ కనిపిస్తుంది. ఈ పండుగ సీజన్‌లో, మీరు అందించే బహుమతులను గురించి పునరాలోచించడంతో పాటుగా పరిశీలించాల్సిందిగా నేను అభ్యర్ధిస్తున్నాను. స్వీట్లు లేదా ఫ్రై చేసిన పదార్థాలకు బదులుగా బాదములను మీ తోబుట్టవులకు అందించండి. ఇవి ఆలోచనాత్మక బహుమతిగా నిలుస్తాయి. ఇవి దీర్ఘకాలంలో వారి ఆరోగ్యానికి సైతం  తోడ్పడతాయి. వీటితో పాటుగా, బాదములలో  అధిక మొత్తంలో బీ2 లేదా రిబోఫ్లావిన్‌ ఉంటుంది. శక్తి ఉత్పత్తి  చేయడంలో మరియు మనం తీసుకున్న ఆహారాన్ని ఇంధనంగా మార్చడంలో అందరికీ తెలిసిన విటమిన్‌  ఇది. ఈ కారణం చేత శక్తివంతమైన స్నాక్‌గా బాదములను తీసుకోవచ్చు!’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments