Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదే పనిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (19:03 IST)
పెద్దల ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదనీ, ముఖ్యంగా ఆడపిల్లలు కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదని పెద్దలు చెబుతుంటారు. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని అమెరికా వైద్యులు నిర్థారించారు. 
 
రోజులో ఎక్కువ సమయం కాలు మీద కాలువేసుకుని కూర్చోవడం వల్ల అనేక అనర్థాలు ఎదురవుతాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు టైట్ డ్రస్‌లు వేసుకుని ఎక్కువగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ఎముకల నొప్పులు లేదా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
 
దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు దీనిపై పరిశోధన చేయగా, కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవారిలో మోకాళ్ళ నొప్పులు వచ్చినట్లు తేలిందంటున్నారు. మోకాళ్ళ నొప్పుల రోగులను పరిశీలించిన తరువాత వైద్యులు ఈ విషయాన్ని నిర్థారించారు. నడుము కింద భాగం, రెండు కాళ్ళను కలుపుతూ పెల్విన్ అనే పెద్ద ఎముక ఉంటుంది. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నప్పుడు పెల్విన్ పై ప్రభావం పడి కాళ్ళు, నడుము నొప్పులు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

తర్వాతి కథనం
Show comments