Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం పూట కునుకు మంచిదే.. జ్ఞాపకశక్తి పెరిగిందట..!

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (15:22 IST)
మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత హాయిగా అలా అరగంట పాటు కునుకు తీయాలనుకుంటున్నారా? అయితే బరువు పెరిగిపోతామని భయపడుతున్నారా? అలాంటి వారు మీరైతే.. ఈ కథనం చదవాల్సిందే. భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం సమయంలో కునుకు తీయడం చాలా ఆరోగ్యకరమని సెలవిస్తున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని ఇటీవలి ఓ అధ్యయనంలో పేర్కొన్నారు. 
 
మధ్యాహ్నం సమయంలో క్రమం తప్పకుండా నిద్రపోవటం వల్ల మానసిక చురుకుదనంతో ముడిపడి ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఆన్‌లైన్ జర్నల్ జనరల్ సైకియాట్రీలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. మధ్యాహ్నం వేళ నాపింగ్ అనేది మంచి స్థాన అవగాహన, శబ్ధాన్ని గుర్తించే పటిమ, పని జ్ఞాపకశక్తితో ముడిపడి ఉంటుంది. సుదీర్ఘ ఆయుర్దాయంతో పాటు వచ్చే న్యూరోడిజెనరేటివ్ మార్పులు, చిత్తవైకల్యం అవకాశాన్ని పెంచుతాయి. అభివృద్ధి చెందిన దేశాలలో 65 ఏళ్ల వయసు పైబడిన 10 మందిలో ఒకరు ఇలా చిత్తవైకల్యంతో ఉన్నట్లు గుర్తించారు.
 
మధ్యాహ్నం న్యాప్‌లను భోజనం తర్వాత 5 నిమిషాల నిద్రావస్థ కాలంగా నిర్వచించారు. ఇది 2 గంటలకు మించకుండా చూశారు. పరిశోధనలో పాల్గొన్నవారు వారంలో ఎన్నిరోజులు మధ్యాహ్నం కునుకు తీశారని, అది వారం నుంచి నిత్యంకు దారితీసిందా? అనే దానిపై ప్రశ్నించారు. చివరగా మధ్యాహ్నం కునుకు 5 నిమిషాల పాటు కొనసాగించిన వారు పనికి సంబంధించిన జ్ఞాపకశక్తిని పెంపొందించుకున్నారని, వీరిలో మానసిక చురుకుదనం కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments