Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మర్ ఫుడ్, నీటిశాతం ఎక్కువున్న కూరగాయలు ఇవే...

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (22:49 IST)
కాలానికి తగ్గట్లు మన ఆహార పద్ధతులను మార్చుకుంటూ వుండాలి. వేసవి కాలంలో ఎక్కువ నీటి శాతం వున్న వాటిని తీసుకుంటూ వుండాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే సొరకాయ శరీర ఉష్ణోగ్రతనీ కడుపులో మంటని తగ్గిస్తుంది. చెమట ద్వారా సోడియం పోకుండా చేస్తుంది. మధుమేహాన్ని, బీపీనీ అదుపులో ఉంచుతుంది. శరీరంలోని నీటిశాతాన్ని పెంచుతుంది. 
 
పొట్లకాయ తినడం వల్ల శరీరం పొడిబారకుండానూ, చల్లగానూ ఉండేలా చేస్తుంది. బూడిదగుమ్మడి వడదెబ్బ నుండి రక్షిస్తుంది. బీపీతో పాటు ఆస్తమా, రక్త సంబందిత వ్యాధులు, మూత్ర సమస్యలూ ఇలా ఎన్నో వ్యాధుల్ని నివారిస్తుంది.
 
బీరకాయ రక్తశుద్ధికి, రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చల్లదనాన్నిఇవ్వడంతో పాటు మూత్ర సమస్యల్నీ తగ్గించేలా చేసేదే గుమ్మడి. ఇది పొట్టలోని నులిపురుగుల సమస్యను తగ్గించడంతో పాటు జీర్ణశక్తిని పెంచుతుంది. చక్కెర వ్యాధిని, బీపీనీ అదుపులో ఉంచడంతో పాటు చర్మవ్యాధులు రాకుండా చేస్తుంది.
 
కాకరకాయ చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. వేడి పొక్కులూ, చెమటకాయలూ, దద్దుర్లు లాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments