నీరసంగా వున్నప్పుడు చెరకురసం తాగితే..? బరువు తగ్గాలంటే?

వేసవిలో నీరసంగా వుందా..? అయితే వెంటనే గ్లాసు చెరకురసం తాగండి. చెరకు రసంలో వుండే సూక్రోజును శరీరం వెంటనే స్వీకరిస్తుంది. తద్వారా అలసట దూరమవుతుంది. అలాగే చెరకు రసంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలున్

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (12:19 IST)
వేసవిలో నీరసంగా వుందా..? అయితే వెంటనే గ్లాసు చెరకురసం తాగండి. చెరకు రసంలో వుండే సూక్రోజును శరీరం వెంటనే స్వీకరిస్తుంది. తద్వారా అలసట దూరమవుతుంది. అలాగే చెరకు రసంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలున్నాయి. అజీర్తిని పోగొట్టి, జీర్ణశక్తిని పెంచడంలోనూ చెరకురసం అద్భుతంగా పనిచేస్తుంది.


జీర్ణాశయంలో పీహెచ్‌ స్థాయిలను సమతుల్యం చేసే పొటాషియం ఇందులో ఉండటంతో ఈ రసాన్ని తాగితే, అజీర్తికి దూరం చేసుకోవచ్చు. చెరకు రసంలో క్యాల్షియం అధికంగా వుండటం ద్వారా ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా వుంటాయి.
 
చిన్నపిల్లల ఎదుగుదలకు చెరకు రసం చక్కగా దోహదపడుతుంది. అంతేకాదు, వెన్నెముక బలంగా ఉండటానికి కూడా చెరకు ఉపయోగపడుతుంది. అలాగే వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణాలు చెరకు రసంలో ఎక్కువగా వున్నాయి. కాలేయాన్నీ ఆరోగ్యంగా ఉంచడంలోనూ చెరకు రసం కీలక పాత్ర పోషిస్తుంది. గ్లాసు చెరకురసానికి అరచెక్క నిమ్మరసాన్ని కలిపి తీసుకోవాలి.
 
రోజుకు ఇలా రెండు సార్లు తాగితే, కాలేయ పని తీరు మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో అధికబరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను చెరకు రసం బాగా తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజూ గ్లాసుడు చెరకు రసం తాగితే మంచి ఫలితం వుంటుంది. అలాగే చెరకు రసం శరీరంలోని టాక్సిన్లను కూడా తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha Ruth Prabhu: రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత రూతు ప్రభు

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

తర్వాతి కథనం
Show comments