Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలా.. అయితే చెరకు, నిమ్మరసాన్ని కలిపి తీసుకోండి

చెరకు రసాన్ని తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధికబరువు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్. దీనివల్ల అనారోగ్య సమస్యలు తప్పవు. అందుకే రోజుకు ఒక గ్లాసుడ

Webdunia
శనివారం, 6 మే 2017 (14:57 IST)
చెరకు రసాన్ని తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధికబరువు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్. దీనివల్ల అనారోగ్య సమస్యలు తప్పవు. అందుకే రోజుకు ఒక గ్లాసుడు చెరకు రసం సేవించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవచ్చు.

అంతేగాకుండా చెరకు రసాన్ని సేవించడం ద్వారా శరీరంలోని వ్యర్థాలన్నీ ఎప్పటికప్పుడు బయటకు పంపేయొచ్చు. ఈ వ్యర్థాలను బయటికి పంపించకపోతే చెడు కొలెస్ట్రాల్‌గా మారిపోతాయి. అందుకే చెరకు రసంతో ఆ కొవ్వును కరిగించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇకపోతే చెరకు రసం జీవక్రియ రేటు మెరుగుపడేలా తోడ్పడుతుంది. అధిక బరువుని అదుపులో ఉంచాలనుకునేవారు చెరకు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. చెరకులో ఇనుముతో పాటు ఫోలేట్‌ శాతం కూడా ఎక్కువే ఉంటుంది. హిమోగ్లోబిన్‌ శాతం కూడా పెరుగుతుంది. గర్భిణులు చెరకు రసాన్ని తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువులోని లోపాలను అరికట్టవచ్చు. వేసవిలో చెరకు రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండలో అలసిపోయి తిరిగి వచ్చాక ఒక గ్లాసు చెరకు రసాన్ని తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. 
 
చెరకు రసంలో జింక్‌, మెగ్నీషియం వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లూ, ప్రొటీన్‌లు వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. తరచూ తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా చెరకు రసం వ్యాధినిరోధక శక్తిని పెంపొందించి ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

తర్వాతి కథనం
Show comments