పంచదార వద్దే వద్దు.. బెల్లం, పటిక బెల్లమే ముద్దు.. టీ, కాఫీల్లో..?

కాఫీ, టీల్లో చక్కెర అధికంగా వాడుతున్నారా? అయితే ఇక తగ్గించుకోండి. లేకుంటే ఒబిసిటీ వంటి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తప్పవ్. అధిక మొత్తంలో షుగర్ తీసుకోవడం ద్వారా మధుమేహం, హృద్రోగం వంటి సమస్యలు ఉత్పన్నమవుతా

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (13:43 IST)
కాఫీ, టీల్లో చక్కెర అధికంగా వాడుతున్నారా? అయితే ఇక తగ్గించుకోండి. లేకుంటే ఒబిసిటీ వంటి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తప్పవ్. అధిక మొత్తంలో షుగర్ తీసుకోవడం ద్వారా మధుమేహం, హృద్రోగం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. 
 
అధిక మొత్తంలో చక్కెరలను తీసుకోవటం వలన హార్మోన్, మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది, ఫలితంగా, ఊబకాయం లేదా స్థూలకాయానికి గురిచేస్తుంది. షుగర్ మనలో బరువు నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. కావున వీటికి తగిన మొత్తంలో మాత్రమే చక్కెరలను తీసుకోండి . 
 
చక్కెరలు ఎక్కువగా ఫ్రక్టోజ్‌ను కలిగి ఉంటాయి, ఇవి కాలేయం ద్వారా జీవక్రియలో గణనీయంగా ఉత్పత్తి చేయబడతాయి. కావున, అధిక మొత్తంలో చక్కెరలను తీసుకోవటం వలన కాలేయం తన విధిని సక్రమంగా నిర్వహించలేదు. దీని వలన కాలేయం కొవ్వు పదార్థాలతో నిండి, ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగే అవకాశం ఉంది. 
 
పంచదారను అధికంగా తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను కలుగచేస్తాయి. శరీరంలో ట్రైగ్లిసరైడ్‌ల స్థాయిలను, LDL, రక్తంలో చక్కెరల స్థాయిలను, ఇన్సులిన్ స్థాయిలను, ఉదరభాగంలో ఊబకాయాన్ని పెంచుతాయి. ఇవన్ని గుండె వ్యాధులను కలుగచేస్తాయి. పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లం, పటిక బెల్లం వంటివి వాడితే కొంత మేరకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాగర్ కర్నూల్‌లో చనిపోతున్న కోళ్లు... పౌల్ట్రీ రైతులను వణికిస్తున్న అంతుచిక్కని వైరస్

ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన నేపాల్ ఏకైక కుబేరుడు

రెండో వారంలో అడుగుపెట్టిన ప్రాంతీయ యుద్ధం.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం

ఇరాన్‌‍తో యుద్ధం ముగిసిన తర్వాత మీ సంగతి చెప్తాం : బ్రిటన్‌కు ట్రంప్ వార్నింగ్

రాజమండ్రి కల్తీపాలనో ఇథలీన్ గ్లైకాల్ - తాగితే కిడ్నీలో పాడైపోవాల్సిందే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిహారిక కొణిదెల‌ నిర్మించిన రాకాస’నుంచి రపప్పా.. రపప్పా.. పాట విడుదల

Guruva Reddy: కమల్ హాసన్, ఎన్టీఆర్, నసీరుద్దీన్ షా ఏదైనా చేయగలరు : గురవ రెడ్డి

Vishal: విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో మొగుడు విడుదలకు సిద్ధం

మా షూటింగ్, మా పేమెంట్ అనే నినాదంతో విజయం సాధించాం : వల్లభనేని అనిల్

VN Aditya: అందరికీ ఇన్సూరెన్స్, మిడ్ డే మీల్స్ కొనసాగిస్తాం : దర్శకుల సంఘం

తర్వాతి కథనం
Show comments