Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైక్లింగ్ చేస్తే పదేళ్లు చిన్నగా కనిపిస్తారట.. నిజమా?

అవును. మీరు మీ తోటివారికంటే పదేళ్లు యంగ్‌ కనిపించాలనుకుంటే సైక్లింగ్ చేయండని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. సైక్లింగ్ ద్వారా చక్కటి వ్యాయామంతోబాటు మీ వయసు కూడా తక్కువగా కనిపిస్తుందంటున్నారు పరిశోధక

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (11:38 IST)
అవును. మీరు మీ తోటివారికంటే పదేళ్లు యంగ్‌ కనిపించాలనుకుంటే సైక్లింగ్ చేయండని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. సైక్లింగ్ ద్వారా చక్కటి వ్యాయామంతోబాటు మీ వయసు కూడా తక్కువగా కనిపిస్తుందంటున్నారు పరిశోధకులు. స్వీడన్‌కు చెందిన కొందరు అధ్యయన కర్తలు నిర్వహించిన ఒక పరిశోధనలో వ్యాయామంలో సైక్లింగ్‌కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పలు లాభాలున్నట్టు తేలింది. 
 
నిజానికి వ్యాయామం అంటే మనం సాధారణంగా నడక, లేదా పరుగులెత్తడం, అదీ కాకుంటే బరువులెత్తడం అనే అనుకుంటాం. అయితే వీటన్నిటితోబాటూ సైక్లింగ్‌ కూడా చేయడం వల్ల అటు మన శరీరం బరువు తగ్గడంతోబాటు మానసికంగా ఎంతో ఉత్తేజంగా కూడా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 
 
సైక్లింగ్‌ వల్ల శరీర కండరాలు దృఢంగా తయారవుతాయి. రోజూ సైక్లింగ్‌ చేసేవారు ఇతరులకంటే కూడా పదేళ్లు చిన్నవారిగా కనిపిస్తారు. సైక్లింగ్‌ వల్ల కెలోరీలు అధికంగా ఖర్చు కావడం వల్ల ఊబకాయం సమస్య దరిచేరదు. అంతేకాదు, అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ ఓ నలభై నిముషాల పాటు సైక్లింగ్‌ చేయడం వల్ల ఆ సమస్య కూడా అదుపులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments