గుండెపోటుకు దారితీసే గురక.. నాసికా రంధ్రాలు మూసుకుపోవడం వల్లే...

Webdunia
బుధవారం, 4 మే 2016 (16:39 IST)
అతిగా తిని ఎక్కువగా గురకపెడుతూ సోమరితనంతో కాలం వెళ్లదీయకండని పెద్దవాళ్లు హెచ్చరించడం మనం వింటూనే ఉంటాం. గురక సోమరితనం వల్లే కాకుండా కొన్ని వ్యాధులలో కూడా కనిపిస్తుంది. స్థూలకాయుల్లో, ఫారింజైటిన్ వంటి వ్యాధులతో బాధపడేవారిలో గురక కనిపిస్తుంది. ఏ వ్యాధి లేనివారు కూడా గాఢనిద్రలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి గురకపెడతారు. అతి సామాన్యంగా కనిపించే ఈ గురక మనిషి లావు పెరగడానికే కాకుండా, గుండెపోటు, ఇతర గుండె జబ్బులకు దారి తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 
సాధారణంగా గురకపెట్టేవారు వెల్లికిలా పడుకుని సగం నోరు తెరుచుకుని ఉంటారు. శ్వాస కూడా సగం ముక్కు ద్వారా, సగం నోటి ద్వారా పీల్చుతుంటారు. గురక పెట్టడానికి లింగభేదం, వయోభేదం లేకపోయినప్పటికీ ఎక్కువగా మగవారిలోనూ వృద్ధుల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. 
 
వాతావరణ మార్పులు తరచుగా వచ్చే దగ్గు, జలుబు సైనుసైటిస్ మొదలైన వాటి వలన కూడా నాసికా రంధ్రాల్లో అవరోధం ఏర్పడి గురక వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేసమయంలో గురక వల్ల గుండెకు ఎలాంటి హాని కలుగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.
 
ఏ కారణం చేతనైనా నాసికా రంధ్రాలు మూసుకుపోయినప్పుడు పెద్దగా శ్వాస తీసుకుంటారు. అపుడు గొంతులో ఉండే ఫారింక్స్ లేదా సాఫ్ట్ పాలెంట్ కణజాలం కదలికల వలన పలు రకాల స్థాయిలలో గురక వస్తుంది. సిగరెట్లు, మద్యం మొదలైన అలవాట్లు ఉన్న వారికి కూడా గురక వస్తుంది. 
 
అయితే, గురక ఉన్న వారు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా దీని నుంచి విముక్తి పొందవచ్చు. గొంతునొప్పి లేదా దురద ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అదే సమయంలో సిగరెట్లు, మద్యం సేవించడం మానేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వేసవిలో చల్లని వాతావరణం- తెలంగాణలోని పది జిల్లాల్లో వర్షాలు

పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. రిపబ్లిక్ వేడుకలు రద్దు

అమ్మానాన్నలకు ప్రేమతో... ఇంట్లో సీసీటీవీ కెమెరా అమర్చి మాట్లాడుతున్న యువతి..

పెంపుడు పిల్లి చనిపోయిందని ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థిని

ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తాం.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiva Raj Kumar: గుమ్మడి నర్సయ్య నుంచి శివ రాజ్ కుమార్ ఫియర్స్ లుక్

Aadi Saikumar: మాస్ అప్పీల్‌తో ఈగో రాజా గా ఆది సాయి కుమార్

క్రేజీ కల్యాణం నుంచి హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి ఫస్ట్ లుక్

Samyuktha: ప్రొడ్యూసర్ షూటింగ్‌లో ఇన్వాల్వ్ కావాలి - నిర్మాణంలోకి ఓటీటీలు : రాజేశ్ దండా

'పరా' అంటే శక్తి.. 'భవు' అంటే శివుడు.. పరాభవకు అర్థం చెప్పిన చిరంజీవి

తర్వాతి కథనం
Show comments