Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్లకాయ వేపుడుతో నరాలకు బలం..

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (20:08 IST)
Snake gourd
పొట్లకాయలోని ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం. పొట్లకాయలో చాలా రకాలున్నాయి. పొట్లకాయను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కడుపులో పుండ్లు, గొంతునొప్పి వాటికి చెక్ పెట్టవచ్చు. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని అనవసరమైన ఉప్పు.. నీరు చెమట, మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. 
 
పొట్లకాయలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, మినరల్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, అయోడిన్, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్ కూడా పుష్కలంగా ఉన్నాయి. పొట్లకాయ వేపుడును తీసుకుంటే నరాలు పుంజుకుంటాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో ఏదైనా ఆకుకూరలను తీసుకుంటే అన్ని రకాల పోషకాలు అందుతాయి. అలాగే పొట్లకాయను ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం వుంటుంది. పొట్లకాయను తీసుకోవడం ద్వారా శరీర బరువును అదుపులో ఉంటుంది. 
 
పొట్లకాయ ఆకులను కొద్దిగా నీటిలో వేసి మరిగించి.. ఆ రసానికి కాస్త కొత్తిమీర రసం చేర్చి.. రోజుకు మూడు పూటలా తాగితే కామెర్లు రాదు. ఇది జ్వరాన్ని కూడా నయం చేస్తుంది. 
 
కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఎందుకంటే వాటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పొట్లకాయలో ఖనిజాలు, విటమిన్లు, కెరోటిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తలలోని చుండ్రును తొలగించే గుణం కూడా ఇందులో ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments