Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్నంగా నిద్రిస్తే లాభాలెన్నో.. ముఖ్యంగా బరువు తగ్గుతారట!

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2015 (11:14 IST)
కంప్యూటర్ల ముందు కూర్చుని గంటల పాటు పనిచేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కంప్యూటర్ల పుణ్యమా అంటూ ఆరోగ్య సమస్యలు సైతం అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఆధునికత కారణంగా టెక్నాలజీ పెరగడంతో శారీరక శ్రమ తక్కువైంది. తద్వారా నిద్రలేమి, ఒబిసిటీ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఒబిసిటీతో పాటు నిద్రలేమికి కూడా చెక్ పెట్టాలంటే.. నగ్నంగా నిద్రపోవాలని పరిశోధకులు అంటున్నారు. 
 
ఒంటిమీద నూలుపోగు లేకుండా నిద్రించడం ద్వారా హాయిగా నిద్రపడుతుందని, నగ్నంగా నిద్రించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత నియంత్రణ ఉంటుందని తద్వారా గాఢనిద్ర పడుతుందని.. దుస్తులతో నిద్రిస్తే.. శరీర వేడిమి కారణంగా సుఖనిద్ర లభించదని హెల్త్ స్లీప్ అడ్వయిజర్ క్రిస్టొఫర్ వింటర్ అభిప్రాయపడ్డారు.
 
ఇంకా క్రిస్టోఫర్ వింటర్ చేసిన పరిశోధనల ప్రకారం.. ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా నిద్రించడం ద్వారా అధిక బరువు తగ్గిపోతుంది. గాఢమైన నిద్ర కారణంగా శరీరానికి మేలు చేకూర్చే బ్రౌన్ ఫ్యాట్ పెరిగి, కొవ్వు కరిగిపోతుందని క్రిస్టొఫర్ వింటర్ తెలిపారు. 
 
అంతేగాకుండా ప్రైవేట్ భాగాల్లో చెమట పట్టదు. తద్వారా ఇన్ఫెక్షన్లు, అలర్జీలు దూరమవుతాయి. వీర్యకణాల వృద్ధి వేగంగా జరుగుతుంది. ఇక జీవిత భాగస్వామి కూడా పక్కనే ఉంటే శరీరానికి ఎంతో ఉపయోగమైన ఆక్సీటోసిన్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఆక్సీటోసిన్‌ను 'లవ్ హార్మోన్' అని కూడా అంటారు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని వింటర్ చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్