Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూరగాయలు దీర్ఘకాలం.. తాజాదనం కోల్పోకుండా ఉండాలంటే...

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజూ తాజా కూరగాయలని మార్కెట్ కెళ్లి తెచ్చుకోవడానికి వీలుపడదు. అందుకోసం చాలామంది వారానికి సరిపడా కూరగాయలు ఒకే సారి తీసుకొచ్చి ఫ్రిజ్‌లో పెట్టి వాడుతుంటారు. ఫ్రిజ్‌లో పెట్ట

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (13:19 IST)
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజూ తాజా కూరగాయలని మార్కెట్ కెళ్లి తెచ్చుకోవడానికి వీలుపడదు. అందుకోసం చాలామంది వారానికి సరిపడా కూరగాయలు ఒకే సారి తీసుకొచ్చి ఫ్రిజ్‌లో పెట్టి వాడుతుంటారు. ఫ్రిజ్‌లో పెట్టినంత మాత్రానా కూరగాయలు ఎక్కువ సమయం పాటూ తాజాగా ఉంటుందను కుంటే పొరపాటు. కానీ కొన్ని సులభ చిట్కాలను పాటించటం ద్వారా కూరగాయలు, పండ్లను ఎక్కువ కాలం పాటూ తాజాగా ఉంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
 
పచ్చిని ఆకుకురాలను ఫ్రిజ్‌లో ఎక్కువ సమయం పాటూ చల్లటి ఉష్ణోగ్రతల ఉంచటం వలన అవి వాటి తాజాదనాన్ని కోల్పోతుంది. కానీ, ఐస్ నీటిలో కడగటం ద్వారా వాటి తాజాదనాన్ని తిరిగి సంతరించుకుంటుంది. టమోటాలు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి లాంటి వాటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇవన్నీ బయటపెడితేనే చాలా రోజులు తాజాగా ఉంటాయి.
 
కూరగాయలను ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి ఆ బ్యాగులకు చిన్న చిన్న రంధ్రాలు పెట్టాలి. దీనివల్ల గాలి లోపలికి వెళ్లి కూరలు పాడవకుండా తాజాగా ఉంటాయి.ఆకుకూరల పైభాగానికి పేపర్ చుట్టి పెట్టడం వల్ల మరింత తాజాగా ఉంటాయి. 
 
నెట్ ప్లాస్టిక్ బ్యాగ్‌లలో కూరగాయలను పెట్టడం వల్ల లోపలికి గాలి వెళ్లి కూరగాయలు తాజాగా ఉంటాయి.కొత్తిమీర కరివేపాకు పుదీనాలాంటి వాటిని రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచేటపుడు వాటి వేర్లను కత్తిరించి బ్యాగుల్లోపెట్టాలి. కేరట్, ముల్లంగిలాంటి కూరలను భద్రపరచాలంటే ముందుగా వాటి ముచ్చికలు కట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

తర్వాతి కథనం
Show comments