కొబ్బరి నీళ్లు తాగితే.. అసిడిటీ మటాష్

Webdunia
మంగళవారం, 21 మే 2019 (18:57 IST)
ఈ రోజుల్లో అసిడిటీ, గ్యాస్ సమస్య అందరికీ ఉండేదే. మసాలాలు తిన్నా, లేదా అధికంగా ఆహారం తీసుకున్నా ఇది ఎక్కువ అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే దీని నుండి బయటపడవచ్చు. మందులు వాడటం కంటే సహజ సిద్ధమైన పద్ధతిలో నయం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
 
పుచ్చకాయలో పీచు పదార్థాలు, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో అసిడిటి తలెత్తకుండా అడ్డుకుంటాయి. ఈ పండులోని చల్లదనం, నీటి కారణంగా శరీరంలో హైడ్రేడ్ సమస్య తలెత్తదు. పిహెచ్ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది. యాపిల్, బొప్పాయి వంటి వాటిల్లో కూడా పీచుపదార్థాలు బాగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఎసిడిటీ తలెత్తకుండా కాపాడతాయి. 
 
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే ఎంతో మంచిది. ఇది ప్రకృతి సహజంగా లభించే పానీయం. ఇందులో క్లీనింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటివల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. కొబ్బరి నీళ్లలో కూడా పీచు పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లను నిత్యం తాగడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. 
 
ఎసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు చల్లటి పాలు తాగాలి, స్టొమక్‌లోని యాసిడ్‌ని పాలు పీల్చేసుకుంటాయి. దీంతో కడుపులో మంట ఉండదు. ఎసిడిటీ కారణంగా హార్ట్ బర్న్ తలెత్తితే పంచదార వేసుకోకుండా చల్లటి పాలు తాగాలి. 
 
అరటిపండు ఎసిడిటీ మీద బాగా పనిచేస్తుంది. అరటి పండులోని పొటాషియం స్టొమక్ అంచుల్లో మ్యూకస్‌ను ఉత్పత్తి చేసి శరీరంలోని పిహెచ్ ప్రమాణాన్ని తగ్గిస్తుంది. అరటిపండ్లలో పీచుపదార్థాలు కూడా బాగా ఉంటాయి. ఎసిడిటీకి మిగతా పండ్ల కంటే అరటిపండు మెరుగ్గా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వ్యక్తి భుజం పైకి ఎగిరి పళ్లను దించిన వీధికుక్క (video)

నా డబ్బు నాకు ఇచ్చేయండి, ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి డిమాండ్ (video)

మధ్యాహ్నం భోజనం కలుషితం... ఆరగించిన 44 మంది విద్యార్థుల అస్వస్థత

పవన్ సార్... మా తండాకు రహదారిని నిర్మించండి.. ప్లీజ్ : దీపిక వినతి

ఇండిగో సంక్షోభం: పండుగ సీజన్‌లో టిక్కెట్ల ధరలు పెరుగుతాయ్- రామ్మోహన్ నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments