Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉడికించిన ఓట్స్.. బాదం డార్క్ చాక్లెట్.. సోయా కాఫీతో ఒత్తిడి మటాష్..

ఒత్తిడి దూరం కావాలంటే.. ఒక కప్పు ఉడికించిన ఓట్స్‌ తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఓట్స్‌‌లో మనిషిని ఉత్తేజితం చేసే సెరోటోనిన్‌ హార్మోన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే పీచుపదార్థం నిదానంగా జీర్ణ

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2016 (18:02 IST)
ఒత్తిడి దూరం కావాలంటే.. ఒక కప్పు ఉడికించిన ఓట్స్‌ తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఓట్స్‌‌లో మనిషిని ఉత్తేజితం చేసే సెరోటోనిన్‌ హార్మోన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే పీచుపదార్థం నిదానంగా జీర్ణం కావడంతో పాటు వీటికి రక్తపోటును అస్తవ్యస్తం కాకుండా నిలబెట్టే లక్షణం ఉంది. అయితే, ఓట్లలో దాల్చిన చెక్క పొడిని, ఒక చెంచా తేనె కూడా కలిపి తీసుకుంటే తీపి పట్ల ఉన్న కోరికా తీరుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.
 
అలాగే బాదం గింజలతో చేసిన డార్క్‌ చాక్లెట్లలో సెట్రస్ హార్మోన్లను తగ్గించే గుణం పుష్కలంగా ఉంది. ఇది రక్తపోటును తగ్గించడంలో మందులతో సమానంగా పనిచేస్తుంది. బాదాం పప్పులో గొప్ప శక్తినిచ్చే ప్రొటీన్‌ కూడా ఉంది. ఇది మోనో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌కు ఎంతో మంచి చేస్తుంది. అలాగే డిప్రెషన్‌ను తగ్గించే శక్తి కూడా ఈ డార్క్‌ చాక్లెట్‌కు ఉంది.  
 
సోయా పాలతో చేసిన కాఫీ తాగితే ఒత్తిడి మటాష్ అవుతుంది. వీటిలో గల ఫోలేట్‌ నిల్వల వల్ల మనసును ప్రశాంతపరిచే సెరటోనిన్‌ హార్మోన్లు పెరుగుతాయి. కాఫీతో కోకో పౌడర్‌ కలిపి తీసుకుంటే మనిషికి మేలు చేసే డొపామిన్‌ హార్మోన్లు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి స్నాక్స్.. సాయంత్రం 6 రకాలు.. రోజుకో రకం

బైక్ దొంగతనాలు.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..టెస్ట్ రైడ్ ముసుగులో..?

ఏపీలో రూపురేఖలు మారిపోనున్న రైల్వే స్టేషన్లు..

Bullet Train: హైదరాబాద్ - ముంబై, బెంగళూరు, చెన్నైలకు బుల్లెట్ రైళ్ల అనుసంధానం

శ్రీవారి కొండపై బ్రాండెడ్ లగ్జరీ హోటల్స్... లైసెన్సులు జారీ చేయనున్న తితిదే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

తర్వాతి కథనం
Show comments