Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుమ్మడికాయ సూప్... గుమ్మడి ప్రయోజనాలు ఇవే...

ఇప్పటి ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా వుండటమనేది పెద్ద సమస్యగా మారింది. మనం తినే ఆహారంలో అన్నింటిని తినకపోవడం వలన ఈ సమస్య ఎదురవుతుంది. గుమ్మడికాయ... దీనిని అందరూ సరిగా తీసుకోరు. కాని దీనివలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. గుమ్మడి గుండెకు ఎంతోమేలు

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2017 (19:04 IST)
ఇప్పటి ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా వుండటమనేది పెద్ద సమస్యగా మారింది. మనం తినే ఆహారంలో అన్నింటిని తినకపోవడం వలన ఈ సమస్య ఎదురవుతుంది. గుమ్మడికాయ... దీనిని అందరూ సరిగా తీసుకోరు. కాని దీనివలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. గుమ్మడి గుండెకు ఎంతోమేలు చేస్తుంది. దీనిలోన పీచు, విటమిన్ సి గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. 
 
ఎముక సాంద్రత దృఢపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, బీటాకెరొటిన్లు అధికంగాఉంటాయి. ఇవి కంటిచూపు స్పష్టంగా ఉండటానికి దోహదం చెస్తాయి. కంటి సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. చదువుకునే పిల్లలకు గుమ్మడితో చేసిన వంటకాలు తినిపించడం ఎంతో మంచిది. 
 
తల్లి కావాలనుకుంటున్నవారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది.
 
దీనిలో ఉండే విటమిన్ ఎ శరీరంలో బీటాకెరొటిన్‌గా మారి హార్మోన్ల అసమతుల్యత రాకుండా కాపాడుతుంది. విటమిన్ సి అందించే కూరగాయల్లో గుమ్మడి కూడా ఒకటి. ఇది శరీరంలో వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఫలితంగా రకరకాల వైరస్‌లూ, ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు గుమ్మడి గింజల్ని తినొచ్చు. ఇవి శరీరంలో మేలు చేసే హార్మోన్లను విడుదల చేయడంతో ఒత్తిడి తగ్గి అలసట దూరమవుతుంది. హాయిగా నిద్రపడుతుంది. 
 
గుమ్మడికాయతో కూర, పులుసు, సూప్, వంటివి చేసుకోవచ్చు. సూప్‌ను ఎలా తయారుచేయాలంటే...
కావల్సినవి... నూనె రెండు చెంచాలు, సోంపు పొడి రెండు చెంచాలు, ఉల్లిపాయ చిన్నది ఒకటి, తీపి గుమ్మడి ముక్కలు అరకప్పు, కూరగాయలు ఉడికించిన నీరు ఐదు కప్పులు, వెన్న పావుకప్పు, బాదంముద్ద ఒక చెంచా, ఉప్పు,మిరియాలపొడి, రుచికి సరిపడా.
 
తయారీ... పొయ్యమీద బాణలి పెట్టి నూనె వేడి చేయాలి. అందులో సోంపు పొడి, పుదీన తరుగు వేయాలి. రెండు నిమిషాలయ్యాక ఉల్లిపాయ, గుమ్మడి ముక్కలు, తగినంత ఉప్పూ, మిరియాల పొడి వేయాలి. ఉల్లిపాయ వేగిందనుకున్న తరువాత కూరగాయల ముక్కలు ఉడికించిన నీరు వేయాలి. ఈ నీళ్ళు సగం అయ్యాక దింపేయాలి.
 
ఈ నీటిని ముక్కలతో మిక్సీ జారులోకి తీసుకొని మెత్తని గుజ్జూలా చేసి బాదం ముద్ద, వెన్న కలపాలి. దీన్ని మరలా పొయ్యి మీద పెట్టి చిక్కగా అయ్యాక దింపేయాలి. ఈ సూప్‌ను చపాతితో కూడా తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments