Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌లో వున్నారుగా.. పిల్లలకు పిస్తా పెట్టండి..

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (13:23 IST)
లాక్ డౌన్‌లో వున్న ప్రజలంతా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వైద్యులు చెప్తున్నారు. ఏవి పడితే అవి తినకుండా పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా వుండవచ్చునని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు పోషకాహారం ఇవ్వాలని న్యూట్రీషియన్లు చెప్తున్నారు. అలాంటి పోషకాహారం జాబితాలో నట్స్‌ను చేర్చవచ్చు. 
 
నట్స్‌లో పిస్తా పప్పులు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారిలో జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఇందులో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తరచుగా పిస్తీలను తీసుకోవడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఇందులో ఉండే పిండి పదార్ధాలు ఒబిసిటీని దూరం చేస్తాయి. 
 
సాధారణంగా నట్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది..కానీ పిస్తాలో ఆ సమస్య లేదు. ఎక్కువగా తిన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. పిస్తా పప్పులను షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకుంటూ ఆరోగ్యానికి మంచి చేస్తుంది. పిస్తాలు శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి గ్లూకోజ్ స్తాయిలను తగ్గిస్తాయని వైద్యులు చెప్తున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా పిస్తా పప్పులు తీసుకోవచ్చు. 
 
పిస్తాలోని విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను చక్కగా పని చేసేలా చేస్తాయి. ఇవి శరీరంలో సక్రమంగా సరైన రక్త సరఫరాకు ఇవి సహాయపడతాయి. పిస్తాలో ఉండే విటమిన్ ఇ చర్మంలో త్వరగా వృధ్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments