డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? పార్కులో అలా పది నిమిషాలు?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:45 IST)
ఈ ఆధునిక ప్రపంచంలో మానవులు తన కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. అందువల్ల నిత్యం ఒత్తిడికి గురవుతున్నారు. మానసిక సమస్యలు, డిప్రెషన్, ఆందోళన వంటి రుగ్మతలతో సతమతమవుతున్నారు. 
 
ఇందుకోసం మానసిక వైద్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. అయితే ఇలా కాకుండా ఒత్తడిని తగ్గించుకోవడానికి నిత్యం 20 నిమిషాల పాటు పచ్చని ప్రకృతిలో అలా తిరిగి రావడం వల్ల ఒత్తడి మటుమాయం అవుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 
 
రోజూ 20 నిమిషాల పాటు పచ్చని ప్రకృతిలో గడిపితే ఒత్తడి అంతా దూరమవుతుందట. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ అలబామాకు చెందిన సైంటిస్టులు నిత్యం పార్కులకు వెళ్లే 100 మందిపై అధ్యయనం చేశారు. వారిలో ఏవైనా మానసిక సమస్యలు ఉన్నాయని ప్రశ్నించారు, అలాగే సంతృప్తిక‌ర‌మైన జీవితం వంటి అంశాల‌పై శాస్త్రవేత్తలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. 
 
ఫలితంగా వారికి ఈ విషయం అర్థమైందట. అదే నిత్యం 20 నిమిషాల పాటు ప‌చ్చ‌ని ఆహ్లాద‌క‌ర‌మైన ప్ర‌కృతి వాతావ‌ర‌ణంలో గ‌డిపే వారికి ఒత్తిడి అస‌లు ఉండ‌ద‌ట‌. దీనికి తోడు డిప్రెష‌న్‌, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా పోతాయ‌ని వారు చెబుతున్నారు. 
 
అయితే సిటీల్లో అలాంటి వాతావ‌ర‌ణం ఉండ‌దు క‌దా అనే వారు.. త‌మ‌కు స‌మీపంలో ఉన్న పార్కుల‌కు వెళ్లి కొంత సమయం గ‌డిపితే చాలు.. మాన‌సిక స‌మస్య‌ల నుంచి బ‌య‌టప‌డ‌వ‌చ్చు. ఒత్తిడి త‌గ్గుతుంది. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా ఒత్తడి బారిన పడితే అలా ఓ 20 నిమిషాలు ఏదైనా పార్కులో తిరిగి రండి. ఒత్తడి మటుమాయం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

గ్రీన్‌ఫీల్డ్ అమరావతి.. రైతు సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తాం.. మంత్రి నారాయణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

తర్వాతి కథనం
Show comments