Webdunia - Bharat's app for daily news and videos

Install App

వళ్లు నొప్పులు... పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఏమవుతుంది?

వళ్లు నొప్పులు, దేహంలో ఎక్కడైనా పట్టేసినట్లు అనిపిస్తే చాలు వెంటనే పెయిన్ కిల్లర్ మాత్ర తెచ్చుకుని వేసేసుకుంటుంటారు చాలామంది. ఐతే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గినప్పటికీ వేరు దుష్ఫలితాలు తలెత్తుతాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ముఖ్

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (19:00 IST)
వళ్లు నొప్పులు, దేహంలో ఎక్కడైనా పట్టేసినట్లు అనిపిస్తే చాలు వెంటనే పెయిన్ కిల్లర్ మాత్ర తెచ్చుకుని వేసేసుకుంటుంటారు చాలామంది. ఐతే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గినప్పటికీ వేరు దుష్ఫలితాలు తలెత్తుతాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్‌ను వాడేవారిలో అల్సర్, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. 
 
కడుపులో మంట, నొప్పి, వాపు, కండరాలు, ఎముకలకు సంబంధించిన వ్యాధుల నివారణకు నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లామెటరి డ్రగ్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారనీ, ఈ మందులు వాడినప్పుడు సదరు సమస్య తగ్గినప్పటికీ కొత్త సమస్య పట్టుకుంటుందని చెపుతున్నారు. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల గుండెపోటు కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు. 
 
కనుక వైద్యులను సంప్రదించకుండా నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్స్ వాడటం చాలా ప్రమాదకరం అని చెపుతున్నారు. కానీ వైద్యుల సలహా లేకుండా చాలామంది నొప్పులు తగ్గేందుకు మందుల షాపులో పెయిన్ కిల్లర్స్ కొనేసి వేసేసుకుంటున్నారనీ, దీనివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు హెచ్చరిస్తున్నారు.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments