Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువెక్కారని తిండి తగ్గిస్తే ప్రమాదం... ఏం జరుగుతుందో తెలుసా?

అధిక బరువు ఉంటే స్థూలకాయం అంటారు, అలా అని తిండి తగ్గిస్తే సన్నబడిపోతారు. ఐతే ఇటీవలి కాలంలో చాలామంది జంక్ ఫుడ్ తినడంతో విపరీతంగా లావెక్కిపోతున్నారు. అవసరానికి మించిన కొవ్వు చేరిపోవడంతో బాన పొట్టతో లావుగా కనబడుతున్నారు. ఇలా అధిక బరువు కారణంగా ఎన్నో అనా

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (14:47 IST)
అధిక బరువు ఉంటే స్థూలకాయం అంటారు, అలా అని తిండి తగ్గిస్తే సన్నబడిపోతారు. ఐతే ఇటీవలి కాలంలో చాలామంది జంక్ ఫుడ్ తినడంతో విపరీతంగా లావెక్కిపోతున్నారు. అవసరానికి మించిన కొవ్వు చేరిపోవడంతో బాన పొట్టతో లావుగా కనబడుతున్నారు. ఇలా అధిక బరువు కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందువల్ల శరీరాన్ని ఎంతమేరకు లావు కావాలో అంతమేరకే ఉండేట్లు చూసుకోవాలి. అలాగని కొందరు ఉన్నట్లుండి తిండి తగ్గించేస్తారు. ఇలాంటి వారు శరీరం బరువు పెరిగిపోతోందనో లేదంటే మధుమేహాన్ని నియంత్రించాలనో అదీ కాదంటే ఇంకా సన్నబడాలనో తినే ఆహారం మోతాదును బాగా తగ్గించివేస్తారు.
 
దీనితో సన్నగా వానపాములా మారిపోతారు. చూసినవారు ఇదేంటి ఇలా అయిపోయారు అంటే బరువు తగ్గడానికి ఇలా చేస్తున్నాను అంటారు. కానీ మరీ అంతగా తిండి తగ్గించేస్తే అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉంది. శరీరానికి అవసరమైన మోతాదులో ఆహారం జీర్ణాశయంలో సగభాగాన్ని కమ్మేసే పరిమాణంలో తీసుకోవాలి. లేదంటే జీర్ణక్రియ బాగానే ఉన్నప్పటికీ విసర్జన క్రియ దెబ్బతింటుంది. మెల్లగా అది మిగిలిన క్రియలపైనా ప్రభావం చూపుతుంది. 
 
జీర్ణాశయంలో తగినంత ఆహారం లేకపోవడంతో ఫలితంగా ఒత్తిడి లేకపోవడంతో మలినాలు బయటికి వెళ్లడంలో తీవ్రమైన అంతరాయం కలుగుతుంది. ఈ కారణంగా కడుపు ఉబ్బరంతోపాటు తరుచూ ఆపాన వాయువులు విడుదల కావడం జరుగుతుంది. ఇంకా తరుచూ తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో శరీరానికి అవసరమైన పదార్థాలను అందించాలి తప్ప సొంతగా నోరు కట్టేసుకుని బరువు తగ్గిపోయామని సంబరపడిపోతే దీర్ఘకాలంలో అది చేటు చేస్తుంది జాగ్రత్త సుమీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

తర్వాతి కథనం
Show comments