Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొద్దస్తమానం కుర్చీల్లో కూర్చొంటున్నారా.. హృద్రోగం ఖాయం...

ఇళ్లలోనూ, ఆఫీసుల్లోనూ ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు మధుమేహంతో పాటు గుండెజబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం లాంటివి మధుమేహం బారిన పడే

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (10:31 IST)
ఇళ్లలోనూ, ఆఫీసుల్లోనూ ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు మధుమేహంతో పాటు గుండెజబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం లాంటివి మధుమేహం బారిన పడేందుకు ప్రధాన కారణాలని ఈ అధ్యయనం చెబుతోంది. 
 
వీటన్నింటితో పాటు రోజువారీ జీవన విధానం కూడా మధుమేహం ముప్పు పెరిగేందుకు కారణాలుగా ఉంటున్నాయని పరిశోధకులు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రతిరోజూ ఉదయం లేవగానే అరగంటపాటు వ్యాయామం చేసేవారు ఇకపై తమ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని అనుకుంటుంటారుగానీ... నిజానికి రోజంతా ఒళ్లు కదల్చకుండా కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్ని ఈ అరగంట వ్యాయామాలు ఏమాత్రం భర్తీ చేయలేవని వారు చెబుతున్నారు.
 
గంటలతరబడీ అదేపనిగా కూర్చొని పని చేసుకుంటుండేవారు ఎక్కువసేపు కూర్చోకుండా... వీలైనప్పుడల్లా సీట్లోంచి లేచి, అటూ ఇటూ తిరగడం.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఆఫీసు కారిడార్లలో పచార్లు చేయడం లాంటివి చాలా మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
 
ఇలా పచార్లు చేయడం వల్ల... ఉదయంపూట వ్యాయామాలకంటే మంచి ఫలితాలను పొందవచ్చునని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి... మితిమీరిన పనిభారంతో ఆఫీసుల్లోనూ, ఇళ్లలోనూ పనిచేసేవారు ఈ అధ్యయనంలో చెప్పినట్లుగా వీలు చిక్కినప్పుడల్లా లేచి అటూ ఇటూ తిరగడం వల్ల మధుమేహం బారినుంచి తప్పించుకున్నవారవుతారు. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments