Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువీబీని తట్టుకుని చర్మాన్ని బలోపేతం చేయడంలో బాదములు సహాయపడతాయంటున్న నూతన అధ్యయనం

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (20:08 IST)
ఆరోగ్యవంతమైన ఆహార అలవాట్లు చర్మ ఆరోగ్యానికి తోడ్పాటునందించడంలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయి. నిజానికి, పరిశోధనకారులు ఫోటో డ్యామేజీగా పిలువబడే సూర్య కిరణాల వల్ల కలిగే నష్టాలను ఎదుర్కోవడంలో ఆహార ప్రాధాన్యతలు చర్మం యొక్క అంతర్గత రక్షణను ఏవిధంగా ప్రభావితం చేస్తాయో శోధించడం ప్రారంభించారు.

సుదీర్ఘకాలం పాటు సూర్యకాంతి పడకుండా నిరోధించడం, రక్షణగా వస్త్రాలను ధరించడం, టాపికల్‌ సన్‌స్ర్కీన్‌ను వినియోగించడం వంటివి ఫోటోడ్యామేజీ నుంచి రక్షించుకోవడానికి అత్యంత కీలకమైన వ్యూహాలుగా నిలుస్తుంటాయి. అయితే పరిశోధకులు వెల్లడించే దాని ప్రకారం ఆహార అలవాట్లు కూడా తమ వంతు పాత్రను పోషిస్తుంటాయి. కాస్మెటిక్‌ డెర్మటాలజీలో ప్రచురితమై ఓ నూతన అధ్యయనం వెల్లడించిన దాని ప్రకారం యువీబీ కాంతి చర్యలను తట్టుకునేలా చర్మాన్ని శక్తివంతం చేయడంలో బాదములు సహాయపడతాయని వెల్లడించింది.
 
లాస్‌ఏంజెల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (యుసీఎల్‌ఏ) పరిశోధకులు ప్రతి రోజూ బాదములు తినడం వల్ల యువీబీ కాంతి(సూర్య కిరణాల వల్ల చర్మం పాడవడానికి అతి ప్రధాన కారణం) ప్రతిరోధకత ఏమైనా పెరుగుతుందా  మరియు చర్మపు కాంతిలో మార్పులేమైనా వస్తాయా అన్నది శోధించారు. ఈ అధ్యయనంలో తమను తాము ఆసియా వాసులుగా చెప్పుకుంటున్న 18-45 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు పాల్గొన్నారు. ఈ మహిళలల్లో ‘చర్మం బర్న్‌ అయినప్పటికీ అతి సులభంగా మచ్చలు పడని’ మహిళల నుంచి కొద్దిగా బర్న్‌ కావడంతో పాటుగా అతి సులభంగా మచ్చలు పడే చర్మం కలిగిన మహిళలు వరకూ ఉన్నారు. సాంకేతికంగా వీరిని ఫిట్జ్‌పాట్రిక్‌ స్కిన్‌ 2, 3 లేదా 4గా విభజించారు. ఈ మహిళలను ర్యాండమ్‌గా 1.5 ఔన్సులు (42 గ్రాములు, 246 కేలరీల) బాదములు లేదంటే 1.8 ఔన్సులు (51 గ్రాములు, 200 కేలరీలు) ప్రీజెల్స్‌ను ప్రతి రోజూ 12 వారాల పాటు తీసుకోమన్నారు. ఈ అధ్యయనం పూర్తి చేయడానికి 29 మంది మహిళల సమాచారం విశ్లేషించారు.
 
ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అధ్యయన ప్రారంభంతో పాటుగా ముగింపు సమయంలో మినిమల్‌ ఎరిథెమా డోస్‌ (ఎంఈడీ) పరిమాణం ఆధారంగా యువీబీ ప్రతిరోధకతను గుర్తించారు. చర్మం ఎర్రబారడానికి కారణమయ్యే అతి తక్కువ మోతాదు యువీబీ కాంతి ఎంఈడీ. (ఈ కేసులో, చేయి లోపలి చర్మం ఎంచుకున్నారు. ఎందుకంటే సూర్యకాంతికి అతి తక్కువ ప్రభావానికి ఇది గురవుతుంది). స్కిన్‌ ఫోటోడ్యామేజీకి మొదటి సూచిక ఎరిథెమా. ఎంఈడీ వృద్ధి చెందితే, యువీబీ ఫోటోడ్యామేజీకి వ్యతిరేకంగా రక్షణ కూడా వృద్ధి చెందుతుందని సూచించడమైనది.
 
ఈ అధ్యయన ఆరంభంలో విభిన్న గ్రూపుల నడుమ ఎంఈడీ పరంగా పెద్దగా తేడా లేదు. కానీ 12 వారాల తరువాత పరిశీలించినప్పుడు రెండు ఎంఈడీలలోనూ వృద్ధి చూశారు. బాదములు తీసుకున్న మహిళలతో పోలిస్తే ప్రిజెల్‌ గ్రూప్‌లో కనీస ఎరిథెమా ఉంది. గణాత్మకంగా గణనీయమైన మార్పులేవీ ఎంఈడీ లేదా ఎక్స్‌పోజర్‌ సమయం పరంగా ప్రిజెల్‌ గ్రూప్‌లో కనబడలేదు.
 
‘‘చర్మం యొక్క సహజసిద్ధమైన రక్షణను బలోపేతం చేయడంలో మరియు ఆరోగ్యవంతమైన చర్మం నిర్వహించడంలో కొన్ని రకాల ఆహార పదార్థాలేవైనా ప్రభావం చూపుతాయా అన్నది తెలుసుకోవడానికి మా బృందాలు ఆసక్తి చూపాయి. ఈ అధ్యయనం ద్వారా చర్మపు ఆరోగ్యంపై అర్థవంతమైన ప్రభావాన్ని ఆహార ప్రాధాన్యతలు చూపుతాయని వెల్లడి అయింది’’ అని ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌, డాక్టర్‌ ఝావోపింగ్‌ లీ, ఎండీ, పీహెచ్‌డీ, ప్రొఫెసర్‌ ఆఫ్‌ మెడిసన్‌ మరియు చీఫ్‌ ఆఫ్‌ ద డివిజన్‌, క్లీనికల్‌ న్యూట్రిషన్‌, యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజిల్స్‌ అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘ఈ నిర్థిష్టమైన అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం 12 వారాల పాటు ప్రతి రోజూ42 గ్రాముల బాదములు తీసుకుంటే ఎంఈడీ మెరుగుపడుతుంది. మరీ ముఖ్యంగా ఆసియా మహిళల్లో ఇది 20% వరకూ వృద్ధి చెందింది. ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించేదాని ప్రకారం యువీబీ కాంతికి వ్యతిరేకంగా చర్మం యొక్క అంతర్గత రక్షణకు మద్దతునందించడంలో బాదములు సహాయపడుతున్నాయి’’ అని జోడించారు.
 
ఈ అధ్యయనంలోనే గమనించిన ఇతర అంశాలలో చర్మపు కాంతి, సెబమ్‌, హైడ్రేషన్‌లను సైతం ఉన్నాయి. అయితే ఈ అంశాలలో గణనీయమైన మార్పులేవీ వారు గమనించలేదు. ఈ అధ్యయనం గురించి డాక్టర్‌ గీతికా మిట్టల్‌ గుప్తా, మెడికల్‌ డైరెక్టర్‌ అండ్‌ కాస్మెటాలజిస్ట్‌ మాట్లాడుతూ, ‘‘రక్షణను అందించే వస్త్రాలు ధరించడం, సన్‌స్ర్కీన్‌ రాసుకోవడం ద్వారా యువీబీ కిరణాల బారిన పడకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చనే సూచనలను భారతీయ మహిళలు అనుసరిస్తుంటారు. అయితే బాదములను తీసుకోవడం వల్ల చర్మంకు అంతర్గతంగా రక్షణ ఇవ్వడం సాధ్యమవుతుందని తెలుసుకోవడం ఆసక్తిగా ఉంది. చాలా సంవత్సరాలుగా, నేను మెరుగైన చర్మ ఆరోగ్యం కోసం బాదములు తీసుకోవాల్సిందిగా సూచిస్తూనే ఉన్నాను, ఇప్పుడు ఈ అధ్యయన ఫలితాలు దానిని నిజం చేశాయి. బాదములలో ఆరోగ్యవంతమైన  కొవ్వు, విటమిన్‌ ఈ వంటివి ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి ప్రయోజనం కలిగిస్తాయి. అందువల్ల భారతీయ మహిళలంతా కూడా తమ డైట్‌లో ఓ గుప్పెడు బాదములను భాగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను’’ అని అన్నారు.
 
ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అతి కొద్దిమందితో మాత్రమే అధ్యయనం చేయడం ఒకటైతే, ఈ అధ్యయనం  సాధారణంగా లేదంటే యువీఏ ఎక్స్‌పోజర్‌ కారణంగా కలిగే ప్రభావం గురించి అధ్యయనం చేయలేదు. ఈ అధ్యయన ఫలితాలు కేవలం యువీబీ రేడియేషన్‌కు వ్యతిరేకంగా రక్షణకు మాత్రమే పరిమితమైంది. ఈ అధ్యయనం కేవలం యువతను మాత్రమే శోధించింది.
 
ఈ అధ్యయనం గురించి షీలా కృష్ణస్వామి, న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ మాట్లాడుతూ, ‘‘ప్రతి రోజూ బాదములు తీసుకోవడం వల్ల పలు ఆరోగ్యప్రయోజనాలున్నాయి. వీటిలో గుండె ఆరోగ్యం  మొదలు చర్మ ఆరోగ్యం వరకూ ఉన్నాయి. ఈ అధ్యయనం మరోమారు దీనిని వెల్లడించింది. యువీబీ కాంతి ప్రభావాన్ని సైతం తట్టుకునేలా చర్మాన్ని శక్తివంతం చేయడంలో బాదములు తోడ్పడతాయని వెల్లడించిన మొట్టమొదటి అధ్యయనమిది. భారతదేశ వ్యాప్తంగా మహిళలు తమ డైట్‌లో బాదములు జోడించడం వల్ల ఆరోగ్యవంతమైన చర్మం పొందగలరు’’ అని అన్నారు.
 
బాదములు ఫైబర్‌ (100 గ్రాములు/30 గ్రాముల సర్వింగ్‌కు 12.5/3.5 గ్రాములు), 15 అత్యవసర పోషకాలు (100 గ్రాములు/30 గ్రాముల సర్వింగ్‌కు): మెగ్నీషియం (270/81 మిల్లీగ్రాములు), పొటాషియం (733/220 ఎంజీ) విటమిన్‌-ఇ(25.6/7.7ఎంజీ) వంటివి అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments