Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రిడ్జ్‌లో టమోటాలను పెడుతున్నారా? కెచప్, సాస్, జామ్‌లను నెలలోపు..?

ఫ్రిడ్జ్‌ల్లో ఏది మిగిలితే దాన్ని భద్రపరిచేయడం ప్రస్తుతం ఫ్యాషనైంది. ఆహార పదార్థాలు పాడుకావనే ఉద్దేశంతో వాటిలో ఏది పడితే దాన్ని పెట్టేయకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా టమోటాలను ఫ్రిజ్‌లో పెట

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (17:32 IST)
ఫ్రిడ్జ్‌ల్లో ఏది మిగిలితే దాన్ని భద్రపరిచేయడం ప్రస్తుతం ఫ్యాషనైంది. ఆహార పదార్థాలు పాడుకావనే ఉద్దేశంతో వాటిలో ఏది పడితే దాన్ని పెట్టేయకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా టమోటాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదంటున్నారు. టమోటాలను ఫ్రిజ్‌లో పెట్టడం ద్వారా విటమిన్ సి కోల్పోయే అవకాశం ఉందని.. అలాగే అది రుచి కూడా తగ్గిపోతుంది. టమోటా పండ్లను బయటే పేపర్ బ్యాగ్‌లో పెట్టుకోవడం మంచిది. 
 
అలాగే ఉల్లిపాయలను, అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. తేనెను ఎప్పుడూ రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. కానీ సూర్యరశ్మి తగలకుండా ఉంటే మంచిది. తేనెను ఫ్రిజ్‌లో ఉంచటం ద్వారా చిక్కగా మారటమే కాకుండా స్పటికంగానూ మారుతుంది. దీంతో వాడుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది. ఇక పుచ్చకాయలను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. 
 
వెల్లుల్లి పాయలను పొట్టు తీసి, గాలి చొరబడని డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. కేవలం తక్కువు సమయం నిల్వచేసుకోవడానికి మాత్రమే ఈ పద్ధతిని అనుసరించాలి. ఇక బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇలా పెడితే అవి ఎండిపోవడంతో వాటిని తినడం ద్వారా వాటిలోని పోషకాలు ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయవు. ఇక కెచప్, సాస్, జామ్‌లాంటి వాటిని నెలకుపైగా ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

తర్వాతి కథనం
Show comments