నొప్పే కదా అని మసాజ్ చేసుకుంటే.. ప్రాణమే పోతుంది జాగ్రత్త...

కాలికి ఏదైనా గాయమై, రక్తం గడ్డకట్టినప్పుడు అక్కడ ఏదైనా తైలం లేదా యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ క్రీములను పూయమని, కానీ ఆ ప్రాంతంలో గట్టిగా ఒత్తిడి కలిగించకూడదని వైద్యులు చెప్తూనే ఉంటారు. మరి ఢిల్లీలోని ఓ తల్లికి ఈ విషయం తెలియక చేతికి అందివచ్చిన కొడుకుని పోగొట్టు

Webdunia
మంగళవారం, 2 మే 2017 (11:56 IST)
కాలికి ఏదైనా గాయమై, రక్తం గడ్డకట్టినప్పుడు అక్కడ ఏదైనా తైలం లేదా యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ క్రీములను పూయమని, కానీ ఆ ప్రాంతంలో గట్టిగా ఒత్తిడి కలిగించకూడదని వైద్యులు చెప్తూనే ఉంటారు. మరి ఢిల్లీలోని ఓ తల్లికి ఈ విషయం తెలియక చేతికి అందివచ్చిన కొడుకుని పోగొట్టుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే... ఓ 23 ఏళ్ల యువకుడికి బ్యాడ్మింటన్ ఆడే సమయంలో కాలి మడమకు గాయమైన ఫలితంగా కాలి నరాల్లో రక్తం గడ్డకట్టింది. కాలికి వేసిన ప్లాస్టర్ తీసివేసినప్పటికీ, అతని కాలి నొప్పి, వాపు తగ్గలేదు. కొడుకి బాధ చూడలేని తల్లి కాలిని మసాజ్ చేసింది. మసాజ్ చేసే సమయంలో ఆమె ఉపయోగించిన శక్తికి కాలిలో గడ్డకట్టిన రక్తం అక్కడి నుండి కదిలి, అతని ఊపిరితిత్తుల్లోకు రక్తాన్ని సరఫరా చేసే పుఫుస ధమనుల్లోకి ప్రయాణించి వెంటనే అతని గుండె ఆగిపోయేలా చేసింది.
 
సాధారణంగా గడ్డకట్టిన రక్తం క్రమంతప్పకుండా నిపుణులు ఇచ్చే ఔషధాలతో వాటంతటవే కరుగుతాయని, అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టినప్పుడు చాలా అరుదుగా ఇలాంటివి సంభవిస్తాయని, ప్లాస్టర్ తీసివేసిన తర్వాత కూడా నొప్పి లేదా వాపు తగ్గకుంటే ఎముకల వైద్య నిపుణుడిని సంప్రదించాలి కానీ స్వంత వైద్యం కూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

రాజధాని అమరావతిపై ఏపీ ప్రజల భావన మారాలి.. చంద్రబాబు

పెళ్ళయి నెలకే గుట్టపై నుంచి పడి నవ వధువు మృతి

రౌడీయిజం - దౌర్జన్యం చేయడానికే వైకాపా నేతల అమరావతి యాత్ర : హోం మంత్రి అనిత

వల్లభనేని వంశీ ఇలా అయిపోయారేంటి? వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

మొన్ననే గోవాలో కలిశాను... ఆప్యాయంగా మాట్లాడారు : భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి

తమిళ దిగ్గజ నటుడు కె.భాగ్యరాజ్య ఎలా చనిపోయారంటే...?

ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లికి వెళ్లొచ్చారు.. గుండెపోటుతో భాగ్యరాజ్ కన్నుమూత (video)

తర్వాతి కథనం
Show comments