Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

సిహెచ్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (22:55 IST)
పండుగల సీజన్ సమీపిస్తున్నందున మనందరికీ తీపి పదార్థాలు ఆనందాన్ని అందిస్తాయి. అయితే, మధు మేహం ఉన్నవారికి లేదా వారి మధుమేహం నిర్వహణకు ఇది ఒక సవాలుగా భావించవచ్చు. అదే సమ యంలో ఇక్కడ ఒక శుభవార్త కూడా ఉంది. మీరు తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా మంచి ఎంపికలను ఎంచుకోవడం మరియు కొత్తగా మధుమేహ స్నేహపూర్వక పదార్థాలను అన్వేషించడంపై ఆధారపడి ఉంటుంది.  అలా చేయడం ద్వారా, మీరు మీ రక్తంలో చక్కెర స్థాయి లను అదుపులో ఉంచుకుంటారు. ఆనందించడానికి ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాల ప్రపంచాన్ని కనుగొంటారు.
 
డయాబెటిస్ నిర్వహణ: ఇది మాత్రమే కాదు
మీ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసేది చక్కెర తీసుకోవడం మాత్రమే కాదు. మొత్తం కార్బోహైడ్రేట్స్ తీసుకోవడాన్ని కూడా సరిగా నిర్వహించడం ముఖ్యం. చక్కెరలు, సంక్లిష్ట పిండి పదార్థాలు, ఫైబర్‌తో సహా కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. తీపి పదార్థాలలో తరచుగా డెక్స్‌ట్రోస్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి సాధారణ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతాయి. అయినప్పటికీ, చక్కెరను నివారించడం కంటే పరిగణించవలసినవి చాలా ఉన్నాయి. చక్కెర ప్రత్యామ్నాయాలు కేలరీలు, పిండి పదార్ధాలను తగ్గించినప్పటికీ, అవి ఆకలి మరియు రక్తంలో చక్కెర నియంత్రణలో కీలక పాత్ర పోషించే ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాకు అంతరాయం కలిగించే అవకాశం ఉంది.   
 
మెరుగైన ఆరోగ్యానికి మీ విధానంలో తినండి
ఆహార పదార్థాల గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)ని అర్థం చేసుకోవడం మీ ఆహార ఎంపికలకు సహాయపడుతుంది. జీఐ సూచిక అనేది ఆహారపదార్థాల కోసం స్కోరింగ్ సిస్టమ్. ఇది ఆహారం మీ చక్కెర స్థాయిని ఎంతగా పెంచుతుందో తెలియజేస్తుంది. కాబట్టి, జీఐ సూచిక తక్కువగా ఉండేది మీకు ఆరోగ్యకరమైన ఆహారం. మీరు అప్పుడప్పుడు, మితంగా తినవలసిన అధిక జీఐ సూచిక కలిగిన ఆహార పదార్థాలకు ఉదాహరణలు ఐస్ క్రీమ్‌లు, చాక్లెట్‌లు, స్వీట్లు మొదలైన సాధారణ కార్బొహైడ్రేట్స్. ఈ ప్రధాన గ్లూకోజ్ మూలాలు మీ చక్కెర సమతుల్యతకు చాలా హాని కలిగిస్తాయి.
 
"డయాబెటిస్‌ను నిర్వహించడం అనేది మిమ్మల్ని మీరు కోల్పోయేలా చేయడం కాదు-అది తెలివైన, అవగాహనతో కూడిన ఎంపికలు చేసుకోవడం" అని అబాట్‌ న్యూట్రిషన్ బిజినెస్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఇర్ఫాన్ షేక్ చెప్పారు. “రక్తంలో చక్కెరను నిర్వహించడంలో కీలకమైనది మీ భోజనం గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)ని తగ్గించే సరైన పోషక సమతుల్యతను కనుగొనడం. ఆలోచనాత్మకంగా సరైన నిష్పత్తిలో పదార్థాలను కలపడం ద్వారా, మీరు మీ భోజనం జీఐని నియంత్రించవచ్చు. మీ గ్లూకోజ్ స్థాయిలను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు’’ అని ఆయన అన్నారు.
 
అధిక ఫైబర్ (సజ్జ, జొన్నలు, రాగి), గోధుమ బ్రెడ్, పండ్లు, కూరగాయలు, పప్పులు పుష్కలంగా తీసు కోవడం మంచిది. ఇవి మీరు తీసుకునే సాధారణ కార్బోహైడ్రేట్స్‌ను సమతుల్యం చేస్తాయి, మీ సాధారణ బ్లడ్ షుగర్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడటం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తప్పనిసరిగా కలిగి ఉండాలి.
 
మీకు ఇష్టమైన రుచులను ఆస్వాదిస్తూనే కార్బోహైడ్రేట్స్ తీసుకోవడాన్ని నిర్వహించడానికి మరొక అత్యంత ప్రభావవంతమైన విధానం డయాబెటిస్-స్పెసిఫిక్ న్యూట్రిషన్ (DSN). మధుమేహం ఉన్న వ్యక్తులకు సమతుల్య పోషణను అందించడానికి ఇవి రూపొందించబడ్డాయి. భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి, మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి.
 
“మంచి పోషకాహారం మధుమేహం నిర్వహణలో ముఖ్యమైనది. డయాబెటిస్-స్పెసిఫిక్ న్యూట్రిషన్ (DSN) రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. రోజువారీ భోజనంలో లేని సమయాల్లో అవసరమైన పోషకాలను అందిస్తుంది. ప్రత్యేక పోషకాహార పానీయాలను చేర్చడం వలన క్లిష్టమైన అంతరా లను పూరించవచ్చు. ఇది నిరంతర శక్తిని, మెరుగైన భోజనానంతర గ్లూకోజ్ నియంత్రణను నిర్ధారిస్తుంది. బ్లడ్ షుగర్ పెరుగుదల గురించి చింతించకుండా పండుగలను ఆస్వాదించడానికి మీకు వీలు కల్పిస్తుంది’’ అని డాక్టర్ కళ్యాణ్ సి గురజాడ MRCP, CCT (UK), FRCP అభిప్రాయపడ్డారు.
 
డీఎస్ఎన్ ఎలా సహాయపడుతుంది: తీపి తినాలనే కోరికను తెలివిగా సంతృప్తిపరచండి
మధుమేహ-నిర్దిష్ట పోషకాహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి అపరాధ భావం లేకుండా తీపిని ఆస్వాదించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. డీఎస్ఎన్  ఉత్పత్తులు గ్లైసెమిక్ ప్రభావం తక్కువగా ఉండేలా రూపొందించబడ్డాయి. ఇవి అధిక కార్బొహైడ్రేడ్స్, చక్కెరతో కూడిన డెజర్ట్‌లను భర్తీ చేయడానికి అనువైనవిగా ఉంటాయి. మీ పండుగ విందులలో డీఎస్ఎన్, ఇతర మధుమేహ అనుకూలమైన పదార్థాలను చేర్చడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి:
 
డీఎస్ఎన్ షేక్స్: చక్కెర మిల్క్‌షేక్‌లు లేదా స్మూతీలకు బదులుగా, డీఎస్ఎన్ షేక్ మిక్స్‌ను బేస్‌గా ఉపయోగించండి, బెర్రీలు లేదా అత్తి పండ్ల వంటి మధుమేహ అనుకూలమైన పండ్లలో కలపండి.
చక్కెర ప్రత్యామ్నాయాలు: శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా కృత్రిమ స్వీటెనర్ల వంటి ప్రత్యామ్నాయాలను మితమైన మొత్తంలో ఉపయోగించవచ్చు.
ఇంట్లో తయారుచేసిన స్వీట్లు: సంప్రదాయ స్వీట్లను తయారుచేసేటప్పుడు, కార్బొహైడ్రేట్స్ అధికంగా ఉండేపదార్థాలను డీఎస్ఎన్ పౌడర్ లేదా బాదం లేదా వోట్ పిండి వంటి తక్కువ- జీఐ  పిండితో భర్తీ చేయండి.
తక్కువ-జీఐ ఆహారాలు: బాస్మతి బియ్యం వంటి అధిక-జీఐ ఆహారాలను బ్రౌన్ రైస్‌తో భర్తీ చేయండి. మీ భోజనాన్ని మధుమేహానికి అనుకూలంగా ఉంచుకోవడానికి సాధారణ గోధుమ చపాతీలకు బదులుగా రాగి, సజ్జలు లేదా జొన్న రొట్టె వంటి వాటిని ఎంచుకోండి.
 
రుచికరం, మధుమేహానికి అనుకూలమైన తీపి ఆలోచనలు
బాగా పేరొందిన పండుగ డెజర్ట్‌లను మధుమేహ స్నేహపూర్వక రకాలుగా మార్చడం మీరు అనుకున్న దానికంటే సులభం. డయాబెటిస్-స్పెసిఫిక్ న్యూట్రిషన్ (DSN) ఉత్పత్తులను చేర్చడం ద్వారా, మధుమేహ సంరక్షణను నిర్ధారించుకోవడం, తక్కువ-గ్లైసెమిక్ పదార్థాలను తీసుకోవడం వంటి చర్యలతో, మీరు మీ రక్తంలో చక్కెర నియంత్రణను ప్రభావితం చేయకుండానే పండుగ స్ఫూర్తిని సజీవంగా ఉంచుకోవచ్చు.
 
గాజర్ హల్వా: సువాసనగల యాలకులు, వేయించిన బాదంపప్పు కలిపిన పాలలో తురిమిన క్యారెట్లను మెత్తగా ఉడకబెట్టండి. క్రీము మిశ్రమాన్ని మిగులుస్తూ ద్రవం ఆవిరైపోయే వరకు ఉడికించండి. పర్ఫెక్ట్ నట్టి క్రంచ్ కోసం వేయించిన బాదంపప్పుల చిలకరింపుతో అలంకరించండి.
 
షిర్ సేమ్యా: నెయ్యిలో బంగారు వర్ణంలోకి వచ్చేలా వేయించిన సేమియాను అది చిక్కబడే వరకు పాలు, పచ్చికోవా(ఖోయా)లో ఉడకబెట్టండి. రంగు, సువాసన కోసం కుంకుమపువ్వును కలపం డి. పరిపూర్ణమైన పండుగ ఆనందం కోసం నట్స్ కూడా వేయండి.
 
మూంగ్ దాల్ పాయసం: క్రీమీ బేస్‌ని సృష్టించడానికి మూంగ్ దాల్, బియ్యాన్ని తక్కువ సెగతో ఉడికించాలి. రిచ్‌నెస్ కోసం నెయ్యి వేయాలి. రుచికరమైన, పోషకాలతో కూడిన ట్రీట్ కోసం వేయించిన నట్స్, వెచ్చని పాలను మిక్స్‌ చేయాలి. ఈ ఆనందం గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
 
నట్స్ శ్రీఖండ్: యాలకులు, బాదం, పిస్తాల మిశ్రమంలో కలపడం ద్వారా చిక్కగా ఉన్న పెరుగును కూలింగ్ ట్రీట్‌గా మార్చండి. రిఫ్రెష్ డిలైట్ కోసం చల్లగా వడ్డించండి.
పండుగ సీజన్‌ను ఆస్వాదించేందుకు మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. శ్రద్ధతో ఎంపికలు చేయడం ద్వారా,  కార్బోహైడ్రేట్స్  తీసుకోవడాన్ని సరిగ్గా నిర్వహించడం, మధుమేహ-నిర్దిష్ట పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు ఎలాంటి అపరాధభావం లేకుండా తీపి విందులలో మునిగిపోవచ్చు. పండుగ సీజన్ అంటే ఆనందం, వేడుకలు. ఈ సర్దుబాట్లతో, మీరు మీ ఆరోగ్యం గురించి చింతించకుండా ప్రతి క్షణాన్ని ఆస్వాదించవచ్చు. సమతుల్యత, మీ ఆహార అవసరాలకు అనుగుణంగా అవగాహనతో కూడిన ఎంపికలు చేయడం ప్రధానం అని గుర్తుంచుకోండి. మీ మధుమేహ నిర్వహణను ట్రాక్‌లో ఉంచుకోవడానికి, పండుగ రోజుల్లో కూడా చురుకుగా ఉండడం కోసం మీ చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మర్చి పోవద్దు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విజయసాయి, వైవీగారు మీడియాలో అవాస్తవాలు మాట్లాడారు: విజయమ్మ లేఖ

టెక్కీ హత్య కేసు : హంతకుడి ఆచూకీ చెబితే రూ.5.7 కోట్ల రివార్డు

ఫోన్ చేయడానికి డబ్బులు లేవు... అప్పు తీసుకోవచ్చా... అమితాబ్‌కు టాటా వినతి

అతీంద్రియ శక్తులున్నాయని 4వ అంతస్తు నుంచి దూకేసిన బీటెక్ విద్యార్థి, ఏమైంది? (video)

దీపావళి కానుకగా ఇళ్లను బహుమతిగా ఇస్తున్నాం: మంత్రి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క సినిమా మా ఆయన కోసం చూడమంటున్న రహస్య గోరక్ (video)

గేమ్ ఛేంజర్ ను నార్త్‌లో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న AA ఫిల్మ్స్

నిఖిల్, దివ్యాంశ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా లవ్ మెలోడీ సాంగ్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ ప్రీ లుక్

వామ్‌హోల్‌ కాన్సెప్ట్‌ తో రహస్యం ఇదం జగత్‌ చిత్రం : దర్శకుడు చందు మొండేటి

తర్వాతి కథనం
Show comments