Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెండకాయలు నానబెట్టిన నీటిని తాగితే?

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (14:06 IST)
చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది బెండకాయను ఇష్టపడతారు. ఈ కూరగాయ మనకు అనేక పోషకాలను అందిస్తుంది. పలు రోగాలు రాకుండా చూస్తుంది. కొన్ని వ్యాధులకు మందులా పని చేస్తుంది.


బెండకాయను నీటిలో నానబెట్టి ఆ నీటిని త్రాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చిన్న బెండకాయలు రెండు లేదా మూడు తీసుకుని వాటిని బాగా కడిగి చివర, మొదలు కట్ చేసి తీసెయ్యాలి. 
 
బెండకాయలను నిలువుగా కట్ చేసి అవి మునిగేలా పాత్రలో నీటిని పోయాలి. ఇలా రాత్రంతా బెండకాయ ముక్కల్ని నీటిలో ఉంచితే అవి బాగా నాని వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. ఉదయాన్నే బెండకాయ ముక్కల్ని తీసేసి ఆ నీటిని తాగితే ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఈ నీటిని తాగడం వలన మన పొట్టలోని పేగులు, జీర్ణాశయం శుభ్రపడతాయి. 
 
ఎసిడిటీ, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి. బెండకాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఆ నీరు త్రాగితే తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. ఇంకా ఈ నీటిని తాగడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి హైబీపీ తగ్గుతుంది. గుండె పని తీరు మెరుగుపరిచేందుకు కూడా ఈ నీరు ఎంతగానో దోహదపడుతుంది. 
 
టైప్2 డయాబెటిస్ ఉన్న వారిలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచడానికి బెండకాయ నీరు సహాయపడుతుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలు, జుట్టు రాలే సమస్యలను నివారిస్తుంది. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

కంట్లో కారం కొట్టి.. పెళ్లి కూతురును కిడ్నాప్ చేసే యత్నం.. ఎక్కడ?

ఏప్రిల్ 25న హైదరాబాదుకు అమిత్ షా..

చిత్తు కాగితాలు సేకరించి జీవించే మహిళపై సామూహిక అత్యాచారం

ఏపీలో రిలీజైన టెన్త్ ఫలితాలు : బాలికలదే పైచేయి...

గులకరాయి కథ కంచికేనా... 9 రోజులైన పురోగతి లేదు!!

శ్రీవారి నడకదారిలో విరూపాక్ష హీరోయిన్ సంయుక్త మీనన్

సెప్టెంబర్ నుంచి అఖండ 2 షూటింగ్ ప్రారంభం

కొత్త హీరోతో అనుష్క శెట్టి రొమాన్స్ - లేటెస్ట్ అప్ డేట్

"దేవర" కోసం పోట్లాడుకుంటున్న చందమామ, బుట్టబొమ్మ?

నర్మదా ఘాట్, నెమావార్ మైదానంలో అశ్వత్థామ నడిచే చోట కల్కి 2898 ADలో అమితాబ్

తర్వాతి కథనం
Show comments