Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొర్ర బియ్యం అన్నం తింటే ఏమవుతుందో తెలుసా?

సాధారణంగా మనం తినే బియ్యం తెల్లగా ఉంటే బాగా ఇష్టపడతాము. అందుకు గాను బియ్యాన్ని ఎక్కువుగా పాలీష్ చేయటం వలన దానిలో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి. తద్వారా అనేర రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే... చిరుధాన్యాలుగా పిలువబడే కొర్ర

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (21:34 IST)
సాధారణంగా మనం తినే బియ్యం తెల్లగా ఉంటే బాగా ఇష్టపడతాము. అందుకు గాను బియ్యాన్ని ఎక్కువుగా పాలీష్ చేయటం వలన దానిలో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి. తద్వారా అనేర రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే... చిరుధాన్యాలుగా పిలువబడే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మన ఆహారంలో చేర్చుకోవటం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చు.  వరి బియ్యం వండుకున్నట్లుగానే కొర్ర బియ్యాన్ని వండుకోవచ్చు. ఎక్కువ శక్తి కలిగి ఉండటం వలన రైతులు పొలం పని చేసుకునేటప్పుడు తప్పకుండా కొర్ర అన్నాన్ని తింటారు. 
 
1. వీటిలో పీచుపదార్ధం ఎక్కువుగా ఉండటం వలన ఇది మలబద్దక సమస్యను తగ్గిస్తుంది.
 
2. దీనిలో మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ధైమిన్, రైబోఫ్లేవిన్ అధికపాళ్లలో ఉంటాయి. డయాబెటిస్ రోగులకు కొర్రబియ్యం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని పూర్తిగా అదుపులో ఉంచుతుంది.
 
3. ఉదర సంబంధ సమస్యలకు కొర్రబియ్యం చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో నొప్పి, ఆకలి లేకపోవడం, అజీర్తి సమస్యలకు ఇది చక్కగా పని చేస్తుంది. జీర్ణ నాళాన్ని శుభ్రం చేయడంలో ఇది ప్రముఖపాత్ర వహిస్తుంది. ఇది మూత్రం పోసేటప్పుడు మంటను తగ్గిస్తుంది.
 
4. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అనేక ఆరోగ్య సమస్యలను కలిగించే గ్లుటెన్ కొర్రబియ్యంలో ఉండదు. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచటంలో సహాయపడుతుంది.
 
5. కీళ్లనొప్పులను, జ్వరాన్ని తగ్గిస్తుంది. కాలిన గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడుతుంది. స్త్రీలలో రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతుంది.
 
6. కొర్రలలో మాంసకృత్తులు, ఐరన్ శాతం ఎక్కువుగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
 
కొర్రబియ్యం వండుకునే విధానం.....
1. ఒక గ్లాసు కొర్రలను శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు నీరు పోసి ఒక గంట నానబెట్టాలి. నానబెట్టిన కొర్రబియ్యాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించాలి. ఒకవేళ ఇలా తినలేకపోతే సగం బియ్యం, సగం కొర్రలు కలిపి వండుకోవచ్చు.
 
2. ఈ అన్నంలో వేపుడు కూరలకన్నా పులుసు కూరలు ఎక్కువ రుచిని ఇస్తాయి.

సంబంధిత వార్తలు

రామ్ గోపాల్ వర్మ హత్యకు టీడీపీ కుట్ర.. పోసాని సంచలన వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ ఆస్తులు రూ. 114.7 కోట్లు, అప్పులు రూ. 64.26 కోట్లు, కట్టిన పన్ను రూ. 73 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సందడి... కార్యకర్తల కోలాహలం

వేలాది మంది తరలిరాగా... పిఠాపురం జనసేన అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు!

వారిద్దరూ తల్లిపాలు తాగి రొమ్ముగుద్దారు : మాజీ మంత్రి కేటీఆర్

హనుమాన్ జయంతి సందర్భంగా జై హనుమాన్ IMAX 3D న్యూ పోస్టర్ విడుదల

సాయి దుర్గ తేజ్ ఆవిష్కరించిన పడమటి కొండల్లో ఫస్ట్ లుక్

తెలుగు కథతో సీతా కళ్యాణ వైభోగమే పెద్ద విజయం సాధిస్తుంది: ప్రీ రిలీజ్ లో వక్తలు

సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రలతో త్రినాధ రావు నక్కిన చిత్రం ప్రారంభం

కుర్రహీరోను తాబేలు అనుకొని పొరపడిన పెద్ద హీరోలు - స్పెషల్ స్టోరీ

తర్వాతి కథనం
Show comments