Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ పరగడుపున ఓ గ్లాసుడు జీరా వాటర్ తాగితే..

జీలకర్రలోని స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ వైర‌ల్‌, యాంటీ బ‌యోటిక్‌, యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ ఫంగ‌ల్ గుణాలు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చేస్తాయి.

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (14:00 IST)
రోజూ పరగడుపున ఓ గ్లాసుడు జీరా వాటర్ తాగితే.. ఇట్టే బరువు తగ్గిపోతారని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని పరగడుపునే తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. జీలకర్రలోని స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ వైర‌ల్‌, యాంటీ బ‌యోటిక్‌, యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ ఫంగ‌ల్ గుణాలు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చేస్తాయి. 
 
దీనివల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి అనారోగ్యాలు దరిజేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇక రోజూ జీరా వాటర్ తాగలేని వారు వారానికోసారైనా జీలకర్ర నీటిని సేవిస్తే చక్కని ఫలితం వుంటుందని వారు చెప్తున్నారు. 
 
జీల‌క‌ర్ర నీటిని తాగితే జీర్ణాశ‌యం శుభ్ర‌పడుతుంది. గ్యాస్‌, అసిడిటీ, అజీర్తి, క‌డుపులో వికారం, క‌డుపులోని అల్సర్లు వదిలిపోతాయి. క‌డుపులోని నులి పురుగులు ఉంటే చ‌నిపోతాయి. జీలకర్ర నీటిని సేవించడం ద్వారా కిడ్నీలోని రాళ్లు క‌రుగుతాయి.
 
అంతేగాకుండా.. జీలకర్ర మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. సుఖనిద్ర కోరుకొనే వారు జీలకర్ర నీటిని సేవించడం ఉత్తమం. జీల‌క‌ర్ర నీరు తాగేవారికి రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో రక్తస‌ర‌ఫ‌రా మెరుగు ప‌డటమే గాక రక్త నాళాల్లోని అడ్డంకులు తొల‌గి గుండె స‌మ‌స్య‌లు రావు. మధుమేహులు జీలకర్ర నీరు తాగితే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments