Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనా ఆకులు ముద్దగా నూరి అలా చేస్తే...

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (22:24 IST)
పుదీనాను వంటల్లో ఉపయోగిస్తే, మంచి రుచితో పాటు వాసన కూడా ఇస్తుంది. దీనిలో ఔషధ గుణాలు కూడా మెండుగా ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. చూయింగ్ గమ్, టూత్ పేస్ట్, మరెన్నో మందుల్లో ఎలా వాడినా పుదీనా తాజాదనాన్ని చక్కగా అందిస్తుంది. ఇంకా మాంగనీస్, విటమిన్ ఎ, విటమిన్ సి ఇందులో పుష్కలంగా ఉన్నాయి. 
 
పీచు, ఫోలేట్, ఐరన్, మేగ్నీషియం, క్యాల్షియం, విటమిన్ బి2, ఒమెగా-3 ఫ్యాటి యాసిడ్స్, పొటాషియం, కాపర్ లభిస్తాయి. పుదీనా ఆకులు, నూనె, విత్తనాలు, ఇతర భాగాలు అనేక రకాల వ్యాధులకు నివారిణిగా పనిచేస్తాయి. ఆయుర్వేద వైద్య సలహాను అనుసరించి మాత్రమే పుదీనాను ఆయా వ్యాధుల నివారణకై ఉపయోగించాలి. తలనొప్పిగా ఉన్నప్పుడు పుదీనా ఆకులు ముద్దగా నూరి నుదిటిపై రాయాలి. ఆకులు నలిపి వాసన చూస్తే మంచిది. 
 
పుదీనా ఆకుల పేస్ట్‌ను రాత్రి తలకు పట్టించి పొద్దుటే తలస్నానం చేసినట్లయితే, జుట్టు రాలటం, పేలు తగ్గుతాయి. పుదీనా కషాయం రోజూ 2 సార్లు తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి. గొంతునొప్పిగా ఉన్నప్పుడు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఎండిన ఆకుల పొడితో పళ్లు తోముకోవాలి. పుదీనాతో చేసిన మెంథాల్ దంత వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. 
 
ప్రతి రోజూ ఆకులు తరచుగా నమిలి తినాలి. పుదీనా నూనెతో లవంగ నూనె కలపాలి. ఆ మిశ్రమంలో దూదిని తడిపి పెడితే పిప్పి పళ్ళు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. పుదీనా నూనెను మొటిమల పైన రాసినట్లయితే అవి తగ్గిపోతాయి. స్వరపేటిక ఆరోగ్యానికి పుదీనా రసం తాగాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కత్తితో పొడవాలన్నదే ప్లాన్ : ప్రధాన నిందితుడు వాంగ్మూలం

నాగర్ కర్నూల్‌లో భర్త దారుణం- భార్యను అడవిలో చంపి నిప్పంటించాడు

అవినీతికి పాల్పడితే ప్రధాని అయినా జైలుకు వెళ్లాల్సిందే : అమిత్ షా

పాకిస్తాన్ వరదలు- 788 మంది మృతి, వెయ్యి మందికి పైగా గాయాలు (video)

తెలంగాణాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

తర్వాతి కథనం
Show comments